నా లవర్ నాకు సారీ చెప్పాలి : సెల్ టవర్ ఎక్కి నానా హంగామా చేసిన ప్రియురాలు..!

నా లవర్ నాకు సారీ చెప్పాలి : సెల్ టవర్ ఎక్కి నానా హంగామా చేసిన ప్రియురాలు..!

నవ్వాలా.. ఏడవాలో అర్థం కాదు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే.. ఓ వైపు బతకటమే కష్టం అంటూ కొందరు నానా ఇబ్బందులు పడుతుంటే.. మరికొందరు మాత్రం తిన్నది అరగని పనులు చేస్తుంటారనేది.. ఈ సంఘటనతో స్పష్టం అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరీదుపూర్ గ్రామంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో పిచ్చ పిచ్చ వైరల్ అయ్యింది. నా లవర్ రావాలి.. నా లవర్ నాకు సారీ చెప్పాలి.. ఈ డిమాండ్ తో ఓ యువతి చేసిన హంగామా.. హడావిడి అంతా ఇంతనా.. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఫరీదుపూర్ గ్రామంలో 18 ఏళ్ల యువతి.. గ్రామంలోని ఓ యువకుడిని ప్రేమించింది. అలా ఇలా చాలా గాఢంగా లవ్ చేసింది. ఇద్దరికీ ఏం జరిగిందో ఏమో.. తన లవర్ తో ఆ యువతికి గొడవ జరిగింది. గొడవ తర్వాత బాయ్ ఫ్రెండ్ వెళ్లిపోయాడు. ఇంత గొడవ జరిగిన తర్వాత కనీసం సారీ.. అదేనండీ క్షమాపణ కూడా చెప్పకుండా అలా ఎలా వెళ్లిపోతాడు అని బాగా హర్ట్ అయ్యింది ఈ యువతి..

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by truth. (@thetruth.india)

ఇంత హర్ట్ అయిన ఓ గ్రేట్ ప్రియురాలు.. ఎలాగైనా సరే.. చచ్చి అయినా సరే తన బాయ్ ఫ్రెండ్ తో సారీ.. క్షమాపణ చెప్పించుకోవాలని డిసైడ్ అయ్యింది. అనుకున్నదే తడవుగా గ్రామంలోని సెల్ ఫోన్ టవర్ ఎక్కింది. డ్రామా మొదలుపెట్టింది. నా లవర్ నాకు సారీ చెప్పాలి.. అప్పుడే టవర్ దిగుతాను.. లేదంటే టవర్ పైనుంచి దూకేస్తాను.. సేమ్ డైలాగ్.. రిపీట్ చేస్తూ వచ్చింది. పోలీసులు వచ్చారు.. అబ్బే ప్రియురాలు అస్సలు వెనక్కి తగ్గలేదు.

లాభంలేదు అనుకున్న పోలీసులు.. ఆ బాయ్ ఫ్రెండ్ ను వెతికి మరీ పట్టుకున్నారు. సెల్ ఫోన్ టవర్ దగ్గరకు తీసుకొచ్చారు. ఈ ప్రియుడితో.. సెల్ టవర్ పైన ఉన్న ప్రియురాలికి సారీ.. సారీ.. క్షమించు అంటూ చెప్పించారు. ఆ యువతి మనస్సు కుదుటపడింది. ఇగో దిగింది.. మెల్లగా కిందకు దిగింది. 

ఇదండీ సెల్ టవర్ ప్రేమ కథ.. మొత్తానికి ఈ అమర ప్రేమికులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి.. ఇలాంటి మనులు మళ్లీ చేయొద్దు అంటూ వెళ్లిపోయారు. మొత్తానికి గ్రామస్తులకు ఓ పూట థ్రిల్లర్ లవ్ సినిమా చూపించింది.