హిడింబ మూవీ గ్లింప్స్ రిలీజ్

హిడింబ మూవీ గ్లింప్స్ రిలీజ్

రాజుగారి గది ఫ్రాంచైజీతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్ తమ్ముడు అశ్విన్.. ఇప్పుడు హిడింబ అనే యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్నాడు. నందితా శ్వేత హీరోయిన్. గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్నారు. నిన్న అశ్విన్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు. ఇందులో ఫుల్ మాస్ లుక్ లో కనిపించాడు అశ్విన్. రౌడీల్ని చితక్కొడుతున్నాడు.

ఇదో యాక్షన్ థ్రిల్లర్. అశ్విన్, నందిత ఇద్దరూ పోలిసాఫీసర్స్ గా నటిస్తున్నారు. శుభలేక సుధాకర్, శ్రీనివాస రెడ్డి, విద్యుల్లేఖా రామన్, రాజీవ్ కనకాల, రఘు కుంచె ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వికాస్ బడిస సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలో రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.