పాక్ టీవీ షోలను ఊపేస్తున్న సొట్ట బుగ్గల సుందరి

పాక్ టీవీ షోలను ఊపేస్తున్న సొట్ట బుగ్గల సుందరి

అందం.. నయనానందకరం.. అలాంటి అందగత్తె టీవీ షో (TV Show) లలో కనిపిస్తే మగాళ్లే కాదు.. ఆడవాళ్లూ ఫ్యాన్స్ అయిపోతారు. ఇలాంటి సిట్యువేషన్ ఇప్పుడు పాక్ టీవీ మీడియాలో జరుగుతుంది. పాకిస్తాన్ నటి అయిన హనియా అమీర్ (Hania Amir).. ఇప్పుడు టీవీ షోలలో కుర్రకారు మనసులు దోచేస్తుంది. నటిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. హమీన్ అమీర్ మొదటి సినిమా జనాన్ లో నటించింది. ఆ సినిమా.. అందులోని పాటలు, నటన ఇండియాను సైతం ఉర్రూతలూగించింది. పాక్ కు చెందిన ఓ నటి యూట్యూబ్ ఇండియాలో సైతం ట్రెండింగ్ కావటం.. కోట్ల మంది చూడటం అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది.

ఇప్పుడు ఎందుకు మళ్లీ ఈ అమ్మడు గురించి మాట్లాడుతున్నారు అంటారా.. అక్కడికే వస్తున్నాం. ప్రస్తుతం పాక్ టీవీ షోల్లో నటిస్తున్న హనియా అమీర్.. ప్రస్తుతం పాకిస్తాన్ లో టాప్ రెమ్యునరేషన్ తీసుకునే టీవీ నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె ఒక్క ఎపిసోడ్ చేస్తే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారంట. హనియాతో పోటీ పడే హీరోయిన్స్ ఇంకా ఉన్నా.. హనియాకు ఉన్న డిమాండ్ తో.. వెయిట్ చేసి మరీ.. అడ్వాన్సులు ఇచ్చి మరీ వెయిట్ చేస్తున్నారంట. జస్ట్ ఒక్క గంట ఎపిసోడ్ చేస్తే 5 లక్షలు.. అదే రోజుకు రెండు ఎపిసోడ్స్ చేస్తే 10 లక్షలు పువ్వుల్లో పెట్టి ఇస్తున్నారంట నిర్మాతలు.

హనియాకు మరో పేరు కూడా ఉంది. అదే డింపుల్ క్వీన్ (Dimple Queen). మన భాషలో అయితే సొట్ట బుగ్గల సుందరి. హనియా నవ్వితే బుగ్గపై పడే సొట్ట ఆమెకు మరింత అందాన్ని తీసుకొస్తుందంట. పాక్ యూత్ అయితే హనియా అలియాస్ డింపుల్ క్వీన్ షోను ఎగబడి చూస్తున్నారంట. దీంతో ఇప్పుడు పాక్ టీవీ షోల్లో హనియా హంగామా.. మానియా నడుస్తుందంట. 

అప్పట్లో ఒకే ఒక్క సినిమాతో ఇండియా కుర్రకారును సైతం ఊపేస్తున్న హనియా.. ఇప్పుడు ప్రతి రోజూ టీవీ షోలతో పాక్ యూత్ మనసులు దోచేస్తుందంట.. ఇదండీ హనియా పాక్ లో చేస్తున్న హంగామా.. రోజుకు రెండు ఎపిసోడ్లు.. 10 లక్షల రెమ్యూనరేషన్ తో.. నాలుగు చేతులా బాగా సంపాదిస్తుందంట.. నెలకు ఎంత లేదన్నా 3 కోట్ల రూపాయలను టీవీ షోల ద్వారానే సంపాదిస్తుందని పాక్ వెబ్ సైట్లు రాస్తున్నాయి.