శతక్కొట్టిన డికాక్: KKRకు భారీ టార్గెట్

శతక్కొట్టిన డికాక్: KKRకు భారీ టార్గెట్

డివై పాటిల్ లో డికాక్ దుమ్ము రేపాడు. కోల్ కతా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీతో చెలరేగాడు. కేవలం 70 బంతుల్లో 10 సిక్సర్లు, 10 ఫోర్లతో 140 పరుగులు సాధించాడు. 

 

మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సూపర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 51 బాల్స్ లో 4 సిక్సులు, 3 ఫోర్లతో 68 పరుగులు చేశాడు. వీరిద్దరు చెలరేగుతుంటే కోల్ కతా బౌలర్లు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. డికాక్, రాహుల్ ను  ఔట్ చేసేందుకు నానా తంటాలు పడ్డారు. ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు కానీ..వికెట్ మాత్రం దక్కించుకోలేకపోయారు కోల్ కతా బౌలర్లు. టిమ్ సౌథీ, అండ్రూ రస్సెల్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, నితీష్ రాణాలను కూడా వదల్లేదు. ఇరువురూ తొలుత నెమ్మదిగా ఆడినా.. చివరి 5 ఓవర్లలో పరుగుల సునామీ సృష్టించారు. ముఖ్యంగా క్వింటన్ డికాక్ షాట్లకు కోల్‌కతా బౌలర్ల కళ్లప్పగించి చూడడం తప్ప ఏమీచేయలేకపోయారు. ఓపెనర్లు అజేయంగా చెలరేగడంతో లక్నో 20 ఓవర్లలో 210 పరుగులు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక పాట్నర్ షిప్ కావడం విశేషం. 

 

 

మరిన్ని  వార్తల కోసం 

గోల్డ్ మెడల్ కు అడుగు దూరంలో..

థాయిలాండ్ ఓపెన్ రెండో రౌండ్లోకి పీవీ సింధు