24 గంటల్లో 38,902 కరోనా కేసులు

24 గంటల్లో 38,902 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 38,902 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు భారత్ లో 10,77,618ల కేసులు నమోదయినట్లు ప్రకటించింది. గత 24 గంటల్లో 543 మంది కరోనా బారినపడి చనిపోయారని.. మొత్తంగా ఇప్పటివరకు 26,816 మంది చనిపోయినట్లు తెలిపింది.

ప్రస్తుతం భారత్ లో 3,73,379 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని.. 6,77,423 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో మహారాష్ట్ర అత్యధిక కేసులతో మొదటిస్థానంలో ఉంది. శనివారం వరకు అక్కడ 3,00,937 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) అందించిన సమాచారం ప్రకారం.. జూలై 18 వరకు దేశంలో 1,34,33,742 టెస్టులు చేసినట్లు తెలిపింది. వాటిలో 3,61,024 శాంపిళ్లను నిన్న పరీక్షించారు.

For More News..

రైతులను సొంత భూముల్లోకి పోనివ్వని ఎన్​హెచ్ఏఐ

క్రికెట్ లోకి సరికొత్త ఫార్మాట్..

జెట్టీ కట్టి మూడు కిలోమీటర్లు మోసుకుంటూ..

చనిపోయినప్పుడు నెగెటివ్‍.. తెల్లారే పాజిటివ్‍..