హైలీ ఎనర్జిటిక్ సాంగ్‌‌‌‌ షూట్‌‌‌‌ కంప్లీట్

హైలీ ఎనర్జిటిక్ సాంగ్‌‌‌‌ షూట్‌‌‌‌ కంప్లీట్

సంక్రాంతికి ‘వీర సింహారెడ్డి’గా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న బాలకృష్ణ దసరాకి తన 108వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది. శుక్రవారం హైలీ ఎనర్జిటిక్ సాంగ్‌‌‌‌ షూట్‌‌‌‌ను పూర్తి చేసినట్టు టీమ్ ప్రకటించింది.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పాటకు థియేటర్స్‌‌‌‌లో ఆడియెన్స్‌‌‌‌ బ్రహ్మరథం పడతారని చెప్పాడు అనిల్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫొటో బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌లో లైటింగ్‌‌‌‌తో జాతర వాతావరణం కనిపిస్తోంది.  తమన్ ఈ పాటను కంపోజ్ చేశాడు. బాలయ్యకు జోడీగా  కాజల్ అగర్వాల్ నటిస్తోంది. శ్రీలీల ఇంపార్టెంట్ రోల్‌‌‌‌లో కనిపించనుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.