హిల్ ఫోర్ట్ కేసు: జీతాలు ఆపేస్తే.. అధికారుల్లో కదలిక వస్తుందన్న హైకోర్టు

హిల్ ఫోర్ట్ కేసు: జీతాలు ఆపేస్తే.. అధికారుల్లో కదలిక వస్తుందన్న హైకోర్టు

హైదరాబాద్ లోని హిల్ ఫోర్ట్ ప్యాలెస్ పునరుద్ధరణలో జాప్యంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దీనికి ఆర్థిక, పర్యాటక శాఖ కార్యదర్శులు, జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరయ్యారు. విచారణకు హాజరుకాని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులంటే అధికారులకు అంత చులకనగా ఉందా అని వ్యాఖ్యానించింది. 

నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసి జైలుకు పంపిస్తామని హైకోర్టు పేర్కొంది. జీతాలు, సదుపాయాలు నిలిపివేస్తే.. అప్పుడు కదలిక వస్తుందని తెలిపింది. తదుపరి విచారణకు అరవింద్ కుమార్ తోపాటు సీఎస్ కూడా హాజరు కావాలని ఆదేశించింది. హిల్ ఫోర్ట్ ప్యాలెస్ పునరుద్ధరణపై విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.