హిమాచల్, ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్..చిక్కుకున్న 450 మంది కేదారినాథ్ యాత్రికులు

హిమాచల్, ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్..చిక్కుకున్న 450 మంది కేదారినాథ్ యాత్రికులు

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. బుధవారం జూలై 31, 2024 అర్థరాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లోని మండి, కులు జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్, కొండచరియలు విరిగిపడటంతో భారీ విధ్వంసం జరిగింది. వరదలు, కొండచరియలు విరిగిపడి 11 మంది చనిపోగా.. 50 మంది గల్లంతయ్యారు. 

హిమాచల్  ప్రదేశ్ లోని సిమ్లా పరిధిలో రామ్ పూర్ తహశీల్ లో,  మండి జిల్లాలో పధార్ తహసీల్ లోని జాన్, నిర్మంద్  గ్రామాల్లో కొండచరియలు విరిగిపడటం, క్లౌడ్ బరస్ట్ కారణంగా 50 మంది గల్లంతయ్యారు. ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్ , పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతయిన వారికోసం గాలిస్తున్నారు. 

క్లౌడ్ బరస్ట్, భారీ వరదల కారణంగా మరోవైపు  ఉత్తరాఖండ్ లో కూడా చాలా ప్రాంతాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రవ్యాప్తంగా సంభవించిన వరదల కారణంగా 10 మంది చనిపోయారు. కేదారినాథ్ మార్గంలో కాంక్రీగ్ బిడ్జి, ఫుట్ బ్రిడ్జి కూలిపోవడంతో వందలాది మంది ప్రజలు చిక్కుకున్నారు. వారితో 450 మంది కేదారినాథ్ కు వెళ్లే యాత్రికులు ఉన్నారు. 

కేదార్‌నాథ్‌కు వెళ్లే మొత్తం 450 మంది యాత్రికులు భీంబాలి దాటి గౌరీకుండ్,  -కేదార్‌నాథ్ ట్రెక్ మార్గంలో చిక్కుకుపోయారు. బుధవారం రాత్రి భారీ వర్షం కారణంగా ట్రెక్ రూట్ 20నుంచి -25 మీటర్ల దూరం కొట్టుకుపోయింది.దీంతో కేదారి నాథ్ యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేదార్‌నాథ్ వెళ్లే యాత్రికులు వాతావరణం మెరుగుపడే వరకు , బ్లాక్ అయిన రోడ్లను పునరుద్ధరించే వరకు సురక్షితమైన ప్రదేశంలో వేచి ఉండాలని అధికారులు కోరారు. 

హిమాచల్ ప్రదేశ్ లోని పాధార్ సబ్‌డివిజన్‌లో మేఘాలు పేలడంతో భారీ వరదల కారణంగా ఇద్దరు చనిపోయారు.. 8మంది కనిపించకుండా పోయారు. ఇద్దరి  మృతదేహాలను వెలికి తీసినట్లు అక్కడి అధికారుకులు చెబుతున్నారు. వరదల కారణంగా మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయని మండి ఎడిఎం మదన్ కుమార్ తెలిపారు.