రాహుల్పై కేసు పెట్టండి.. డీజీపీకీ అసోం సీఎం ఆదేశం

రాహుల్పై కేసు పెట్టండి.. డీజీపీకీ అసోం సీఎం ఆదేశం

కాంగ్రెస్ నేత  రాహుల్ గాంధీపై కేసు పెట్టాలని డీజీపీకి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదేశాలు జారీ చేశారు.   రాహుల్   అసోం ప్రజలను  రెచ్చగొడుతూ యాత్ర చేస్తున్నారని ఆరోపించారు.  రాహుల్ యాత్ర నక్సల్స్ పంథాలో నడుస్తోందని.. ఇది అసోంకు ఎట్టిపరిస్థితుల్లో  మంచిది కాదన్నారు. 

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు.  తానంటే హిమంత బిశ్వ శర్మకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ దేశంలోనే అత్యంత అవినీతిపరులైన ముఖ్యమంత్రులలో  ఒకరని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ అన్నారు. తన యాత్రకు బీజేపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. తనను ఎంత ఇబ్బంది పెడితే అంత మంచి జరుగుతుందన్నారు.  తనను కావాలనే కాలేజీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని అన్నారు. బీజేపీ తీరును యావత్ దేశం గమనిస్తోందన్నారు.  

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు హేమంత్ సర్కార్ అడుగడగున అడ్డుకుంటోంది.   జనవరి 23వ తేదీ మంగళవారం రాజధాని గౌహతి సమీపంలోని ఖానాపరాలో భారత్ జోడో యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు కాంగ్రెస్ శ్రేణులపై లాఠీ చార్చ్ చేశారు.  వర్శిటీ బయటే మాట్లాడిన రాహుల్  తాను విద్యార్థులను కలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన  ఇబ్బందులేంటని  ప్రశ్నించారు.