ఫుల్ ట్యాంక్ లెవెల్కు జంట జలాశయాలు

ఫుల్ ట్యాంక్ లెవెల్కు జంట జలాశయాలు
  • ఏ క్షణమైనా గేట్లు ఎత్తే చాన్స్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: భారీ వర్షాలకు గ్రేటర్​కు తాగునీటిని అందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండు కుండలా మారాయి. హిమాయత్ సాగర్ గేట్లు అర్ధరాత్రికి ఏ క్షణమైనా ఎత్తేందుకు మెట్రో వాటర్ బోర్డు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు మూసీ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1,763 అడుగులు కాగా, ప్రస్తుతం 1,762 అడుగులకు చేరింది. ఏ క్షణమైన గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఇక ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1,790 అడుగులు కాగా, ప్రస్తుతం 1,782 అడుగులకు చేరింది. జలాశయాల్లోకి ఇంకా వరదనీరు వస్తున్నట్టు అధికారులు తెలిపారు.