
హైదరాబాద్ హిమాయత్ నగర్ ఏటీఎం చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులతో పాటు..బాధితుడు కేరళ రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
సినీ ఫక్కీలో చోరీ..
కేరళ రాష్ట్రానికి చెందిన ధన్సిఫ్ అలీ, మొహమ్మద్ సహద్, తన్సీ బర్రిక్కల్, అబ్దుల్ ముహీస్ జులై 4వ తేదీన హిమాయత్ నగర్ వద్ద గల పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. ముజీబ్ అనే వ్యక్తి ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేస్తుండగా దొంగతనం చేశారు. ముజీబ్ అప్పటికే 6 ఏటీఎంలలో డిపాసిట్ చేశాడు. 7వ ఏటీఎంలో డిపాసిట్ చేస్తున్న క్రమంలో నిందితులు ముజీబ్పై పెప్పర్ స్ప్రే కొట్టి రూ.7 లక్షలు ఎత్తుకెళ్లారు.
ALSO READ :రూ. 2 వేల కోట్లు ఇచ్చి ఆదుకోండి.. కేంద్రాన్ని కోరిన సీఎం
నిందితులను పట్టుకున్నారు..ఇందులో ట్విస్ట్..
బాధితుడు ముజీమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..7 స్పెషల్ టీమ్స్తో నిందితుల కోసం గాలించారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను పట్టుకున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. నిందితుడు ధన్సిఫ్తో బాధితుడు ముజీబ్ కు పరిచయం ఉంది. బాధితుడ ముజీబ్ కూడా కేరళకు చెందినవాడే. కొన్ని రోజులుగా ముజీబ్ కదలికలపై నిందితుడు ధన్సిఫ్ నిఘా పెట్టి దోపిడికి పాల్పడ్డట్లు పోలీసులు తేల్చారు. నిందితుల నుండి రూ. 3.25 లక్షల నగదు, స్విఫ్ట్ కార్, పల్సర్ బైక్, పెప్పర్ స్ప్రే బాటిల్, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో టెక్నికల్ ఎడిడెన్స్ కీలకంగా మారింది. ముజీబ్కు డిపాజిట్ చేయడానికి అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అన్న కోణంలో విచారణ జరుగుతోంది.