అదానీ గ్రూప్‌కు బిగ్ రిలీఫ్.. హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొట్టిపారేసిన సెబీ

అదానీ గ్రూప్‌కు బిగ్ రిలీఫ్.. హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొట్టిపారేసిన సెబీ

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌కు భారీ ఊరట దక్కింది. అదానీ కంపెనీపై అమెరికా షార్ట్‎సెల్లర్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవంటూ అదానీ గ్రూప్‎కు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) క్లీన్ చిట్ ఇచ్చింది. అదానీ గ్రూప్‎పై చేసిన ఆరోపణలను హిండెన్‌బర్గ్ రుజువు చేయలేకపోయిందని స్పష్టం చేసింది సెబీ. 

అదానీ గ్రూప్ షేర్ల ధరల మేనిప్యులేషన్‎తో పాటు అకౌంటింగ్​ఫ్రాడ్స్‎కూ పాల్పడుతోందని హిండెన్​బర్గ్​రీసెర్చ్ 2024 జనవరిలో సంచలనాత్మక నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. ఆదానీ సీక్రెట్ ఫారిన్ కంపెనీల్లో మాజీ సెబీ ఛైర్ పర్సన్ మాధవి పూరీ బుచ్, ఆమె భర్తకు వాటాలున్నాయని హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసింది. మారిషస్, బెర్ముడా ఫండ్స్ అని వాటిలో మాధవి ఫూరీ బుచ్‎తో పాటు ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది. 

ఈ నిధులను గౌతమ్ బ్రదర్ వినోద్ అదానీ కంట్రోల్ చేస్తున్నారని .. పెట్టుబడులు 2015 నాటివని చెప్పింది. అందుకనే గతంలో ఆదానీపై తాము ఇచ్చిన రిపోర్ట్‎పై సెబీ చర్యలు తీసుకోలేదని ఆరోపించింది హిండెన్ బర్గ్ రీసెర్చ్ కంపెనీ. ఈ క్రమంలో హిండెన్ బర్గ్ ఆరోపణలపై సెబీ దర్యాప్తు చేపట్టింది. అదానీ గ్రూప్‎పై చేసిన ఆరోపణలకు హిండెన్ బర్గ్ ఆధారాలు చూపించకపోవడంతో అదానీ గ్రూప్‎కు సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది. 

అదానీ గ్రూప్ రుణాలను వడ్డీతో తిరిగి చెల్లించారని.. ఎక్కడ నిధులను పక్కదారి పట్టించలేదని సెబీ స్పష్టం చేసింది. అదానీ గ్రూప్ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని పేర్కొంది. అదానీ పోర్ట్స్ అడికార్ప్ ఎంటర్‌ప్రైజెస్‌కు నిధులను బదిలీ చేసిందని, ఆ నిధులను అదానీ పవర్‌కు రుణాలుగా అందించినట్లు తమ దర్యాప్తులో గుర్తించామని సెబీ వెల్లడించింది. హిండెన్ బర్గ్ చేసిన చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో అదానీ గ్రూప్ పై ఎలాంటి జరిమానా విధించడం లేదని సెబీ స్పష్టం చేసింది.