‘సైంధవ్’.. తన పాత్రకు తనే స్వయంగా డబ్బింగ్ చెబుతున్న నవాజ్

‘సైంధవ్’.. తన పాత్రకు తనే స్వయంగా డబ్బింగ్ చెబుతున్న నవాజ్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రం ‘సైంధవ్’. వెంకటేష్​ హీరోగా శైలేష్ కొలను రూపొందిస్తున్న ఈ సినిమాలో నవాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.  వికాస్ మాలిక్ అనే పవర్‌‌‌‌ఫుల్ పాత్రలో ఆయన కనిపించబోతున్నాడు. మొదటి తెలుగు సినిమా అయినప్పటికీ  తన పాత్రకు తనే స్వయంగా డబ్బింగ్ చెబుతున్నాడు నవాజ్. 

ఈ మేరకు డబ్బింగ్ స్టూడియో నుంచి రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్‌‌గా నటిస్తుంటే, ఆర్య మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.  వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ  చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమా విడుదల కానుంది.