బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో హిందీ దివస్ వేడుకలు

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో హిందీ దివస్ వేడుకలు

హైదరాబాద్, వెలుగు: పుణేలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో హిందీ దివస్ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నటి మృణాల్ కులకర్ణితో కలిసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఏఎస్‌ రాజీవ్ ‘మహా బ్యాంక్ సంవద్ సరిత’ అనే బ్యాంక్ ఈ–మ్యాగజైన్ ని విడుదల చేశారు. దీంతోపాటు బ్యాంక్ క్వార్టర్లీ ఇన్‌–హౌజ్ మ్యాగజైన్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆల్ ఇండియా లెవల్ హిందీ పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులను అందించారు. అనంతరం మృణాల్ కులకర్ణి మాట్లాడుతూ హిందీని ప్రమోట్ చేయడంలో హిందీ సినిమా, టెలివిజన్ పాత్ర ఎంతో ఉందన్నారు. 

అత్యున్నత పురస్కారమైన కీర్తి అవార్డును అందుకున్నందుకు బ్యాంకును అభినందించారు. అనంతరం ఏఎస్‌ రాజీవ్ మాట్లాడుతూ క్వాలిటీ కస్టమర్ సర్వీసెస్ అందించడంలో హిందీ, రీజనల్ భాషలు ముఖ్య పాత్రను పోషిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ కె.రాజేశ్​కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏబీ విజయకుమార్, ఆశిష్ పాండే తదితరులు పాల్గొన్నారు.