ముస్లింల కోసం భూమి విరాళం ఇచ్చిన హిందూ కుటుంబం

ముస్లింల కోసం భూమి విరాళం ఇచ్చిన హిందూ కుటుంబం

దేశంలో మత సామరస్యం చాటే వార్త ఇది. భిన్నత్వంలో ఏకత్వంతో ఇండియా.. ప్రపంచదేశాల్లోనే భిన్నమైన దేశంగా పేరుతెచ్చుకోవడానికి ఈ కథనం ఓ ఉదాహరణ.

అస్సాం రాష్ట్రం.. ఉత్తర లక్షింపూర్ లో ఈ సంఘటన లేటెస్ట్ గా జరిగింది. ముస్లిం బరియల్ గ్రౌండ్ పక్కనే ఓ హిందువుకు సంబంధించిన స్థలం ఉంది. కరుణ కాంత భుయాన్ అనే వ్యక్తికి సంబంధించిన స్థలం.. ఆయన మరణానంతరం వారసత్వంగా కుటుంబసభ్యుల ఆధీనంలోకి వచ్చింది. నహర్ పుఖురి కబరిస్థాన్ కమిటీ కోరడంతో… భుయాన్ కుటుంబసభ్యులు భూమి ఇచ్చేందుకు అంగీకరించారు. తమ భూభాగంలోని 0.84 ఎకరాలను ముస్లిం స్మశాన వాటిక కమిటీకి దానం చేశారు.

భుయాన్ కుటుంబ సభ్యుల మంచి మనసుకు.. దాతృత్వానికి స్థానిక ముస్లింలు సంతోషం వ్యక్తంచేశారు. మే 4వ తేదీన వారిని సన్మానించినట్టు కమిటీ చైర్మన్ హమిదుర్ రెహ్మాన్ చెప్పారు. ఈ ముస్లిం స్మశాన వాటికకు ఆనుకునే హిందూ స్మశాన వాటిక కూడా ఉంది.