ఇండస్​ఇండ్​కు రూ.10 వేల కోట్ల ఇన్వెస్ట్​మెంట్

ఇండస్​ఇండ్​కు రూ.10 వేల కోట్ల ఇన్వెస్ట్​మెంట్

న్యూఢిల్లీ: ఇండస్​ఇండ్​ బ్యాంక్​లో హిందుజా గ్రూప్​ రూ.10 వేల కోట్లు ఇన్వెస్ట్​ చేయబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ డీల్​పూర్తవుతుందని జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో ఇండస్​బ్యాంక్​ షేర్లు శుక్రవారం మూడు శాతం లాభపడ్డాయి. ఈ పెట్టుబడి వల్ల బ్యాంకులో హిందుజా గ్రూప్​ వాటా మరింత పెరిగి 26 శాతానికి చేరుకుంటుంది. వాటా పెంపునకు ఆర్​బీఐ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. గత ఏడాదిలో బ్యాంకు షేర్లు 67 శాతం రాబడిని ఇచ్చాయి.

అంతేగాక పోయిన నెల ఈ బ్యాంక్​ మార్కెట్​క్యాప్​ రూ.లక్ష కోట్లకు చేరుకుంది. 2020 జనవరిలో మొదటిసారిగా రూ.లక్ష కోట్ల మార్కెట్​క్యాప్​ను టచ్​చేసింది. అయితే కరోనా టైమ్​లో షేర్ల విలువ బాగా తగ్గింది. ప్రస్తుతం ఇండస్​ఇండ్​ బ్యాంక్​షేర్​ 52 వారాల గరిష్టం రూ.1,342 లను ఈ నెల 13న టచ్​ చేసింది. 52 వారాల కనిష్టం రూ.763.