Job News: వాక్ ఇన్ ఇంటర్య్వూ.. HAL అప్రెంటీస్ పోస్టులు

Job News: వాక్ ఇన్ ఇంటర్య్వూ.. HAL అప్రెంటీస్ పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఏదైనా డిగ్రీ, బి.టెక్./ బీఈ, డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు వాక్ -ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. జనవరి 28 నుంచి 30 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

ఖాళీలు: 62.
విభాగాలు: 

టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్​ :  మెకానికల్ ఇంజినీరింగ్ 30,ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ 05, కంప్యూటర్​సైన్స్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్​సైన్స్ టెక్నాలజీ 02, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 06, సివిల్ ఇంజినీరింగ్ 04, ఇనుస్ట్రుమెంటేషన్స్ ఇంజినీరింగ్ 03. 

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ : బి.కాం. 01, బీఎస్సీ/ బీసీఏ 02. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్  –   మెకానికల్ ఇంజినీరింగ్ 05, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ 01, కంప్యూటర్​సైన్స్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్​ సైన్స్ టెక్నాలజీ 01, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 01, సివిల్ ఇంజినీరింగ్ 01, ఇనుస్ట్రుమెంటేషన్స్ ఇంజినీరింగ్ 01.

ఎలిజిబిలిటీ

టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్‌లు: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బి.కాం./ బీఎస్సీ/ బీసీఏ పూర్తిచేసి ఉండాలి. 

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బి.టెక్./ బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 26 ఏండ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 13.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
వాక్ ఇన్ ఇంటర్వ్యూలు: జనవరి 28, 29, 30. 
పూర్తి వివరాలకు www.hal-india.co.in వెబ్​సైట్​ను సంప్రదించండి.