రాముడి పూజకు ముందు హనుమంతుడి ఆశీస్సులు.. మోడీ హనుమాన్‌గఢీ విజిట్

రాముడి పూజకు ముందు హనుమంతుడి ఆశీస్సులు.. మోడీ హనుమాన్‌గఢీ విజిట్

న్యూఢిల్లీ: అయోధ్యలోని ప్రసిద్ధ రామాలయ నిర్మాణ పనులు బుధవారం మొదలవనున్నాయి. భూమి పూజతో ప్రారంభమయ్యే నిర్మాణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ విజిట్‌లో భాగంగా రామ మందిరానికి వచ్చే ముందు మోడీ మరో ఆలయాన్ని దర్శింకోనున్నారని తెలుస్తోంది. 10వ శతాబ్దంలో నిర్మించిన హనుమాన్‌గఢీ అనే దేవాలయాన్ని మోడీ దర్శింకుంటారని ఆ ఆలయ పూజారి తెలిపారు.

అయోధ్యలోనే హనుమంతుడు కొలువై ఉన్న హనుమాన్‌గఢీని ప్రధాని మోడీతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దర్శించుకుంటారని, ఆ తర్వాతే రామ జన్మభూమికి వెళ్లి భూమి పూజ కార్యక్రమంలో పాలుపంచుకుంటారని సమాచారం. ‘హనుమంతుడు లేకుండా రాముడి ఏ పనీ ప్రారంభమవ్వదు. ఇందుకే మోడీ జీ, యోగీ జీ ఈ హనుమాన్ టెంపుల్‌కు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాతే హనుమంతుడి దీవెనలతో రామాలయ జన్మభూమికి వెళ్లి భూమి పూజ మొదలుపెడతారు’ అని హనుమాన్‌గఢీ ఆలయ పూజారి మధువన్ దాస్ చెప్పారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు చేయడంలో భాగంగా మోడీ ఏడు నిమిషాల పాటు ఉండనున్నారని పేర్కొన్నారు.