దృశ్యం సినిమా స్టైల్లో మర్డర్.. భర్తను చంపి టైల్స్ కింద పాతిపెట్టింది.. చివరికి ఎలా తెలిసిందంటే..

దృశ్యం సినిమా స్టైల్లో మర్డర్.. భర్తను చంపి టైల్స్ కింద పాతిపెట్టింది.. చివరికి ఎలా తెలిసిందంటే..

దృశ్యం సినిమా చూసే ఉంటారు.. తన ఫ్యామిలీకి ఇబ్బంది కలిగిస్తున్న వ్యక్తిని సైలెంట్ గా లేపేసి.. రహస్యంగా పూడ్చిపెడతాడు ఆ సినిమాలో కథానాయకుడు. ఇది కూడా అలాంటి స్టోరీనే. కానీ తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు కాదు.. తన వివాహేతర సంబంధం కోసం. వయసులో చాలా చిన్నవాడైన వ్యక్తితో సంబంధం పెట్టుకుని భర్తను చంపేసి.. టైల్స్ కింద పాతిపెట్టింది భార్య. ఈ స్టోరీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర పాల్గర్ జిల్లాకు చెందిన విజయ్ చవాన్ (35).. తన భార్య కోమల్ చవాన్ (28)తో కలిసి ముంబైకి 70 కిలోమీటర్ల దూరంలో నలసోపెరా ఈస్ట్ లోని గడ్గపడాలో నివాసం ఉంటున్నాడు. అయితే విజయ్ చవాన్ గత 15 రోజులుగా కనబడకుండా పోయాడు. విజయ్ అదృశ్యం అవ్వటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ బంధువుల ఊర్లలో.. అక్కడక్కడా వెతుకుతూ ఉన్నారు. 

సోమవారం (జులై 21) ఉదయం.. విజయ్ తమ్ముడు.. వెతుకుతూ వెతుకుతూ విజయ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇంట్లో ఫ్లోర్ టైల్స్ లలో రెండు డిఫరెంట్ గా ఉండటం గమనించారు. మిగతా టైల్స్ కలర్స్ కు ఆ రెండింటికి మ్యాచ్ కాకపోవడంతో డౌట్ వచ్చి టైల్స్ తొలగించి చూశారు. టైల్స్ కింద ఏదో దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించారు. 

పోలీసులు అక్కడ అంతా తవ్వి చూస్తే అక్కడ డెడ్ బాడీ బయట పడింది. దీంతో హత్య చేసి పాతిపెట్టినట్లు నిర్ధారించారు. అయితే రెండు రోజుల క్రితమే విజయ్ భార్య కోమల్.. పొరుగింటి 20 ఏండ్ల కుర్రాడు మోను తో కలిసి పారిపోయినట్లు గుర్తించారు. ఇద్దరు గత కొంత కాలంగా వివాహేతర సంబంధంలో ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.