ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం

ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి జగ్​దీప్ ధన్​ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ధన్ ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హోం మంత్రిత్వ శాఖకు పంపారు. ధన్ ఖడ్ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని రాజ్యసభలో హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ధన్ ఖడ్ రాజీనామా ఆమోదం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ధన్ ఖడ్ దేశానికి ఎంతో సేవ చేశారని, ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రధాని ఆకాంక్షించారు. ఉప రాష్ట్రపతి పదవికి జగ్​దీప్ ధన్​ఖడ్ సోమవారం రాత్రి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన ప్రకటించారు.

ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా లేఖను పంపారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు. తన పదవీకాలంలో తనకు అన్ని విధాలా మద్దతుగా ఉన్నందుకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించడంతో ధన్ ఖడ్ మాజీ ఉపరాష్ట్రపతి కావడం గమనార్హం.

Also Read:-ధన్కడ్ రాజీనామా వెనుక బలమైన కారణం ఉంది.. ! : ఎంపీ జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు...

2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా ధన్ ఖడ్  ఎంపికయ్యారు. అంతకుముందు 1990-, 1991 మధ్య కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2019-- 22 వరకు బెంగాల్  గవర్నర్ గా సేవలు అందించారు. రాజీనామాకు ముందు పార్లమెంటు వర్షాకాల సమావేశానికి ముందు సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సభ్యులు భేషజాలకు పోకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలని కోరారు.