ధన్కడ్ రాజీనామా వెనుక బలమైన కారణం ఉంది.. ! : ఎంపీ జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు...

ధన్కడ్ రాజీనామా వెనుక బలమైన కారణం ఉంది.. ! : ఎంపీ జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు...

ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జులై 21 న అనారోగ్యకారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ధన్కడ్. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ముకు పంపించారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు ధన్కడ్.  2022  ఆగస్టు 11న భారత ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన దన్కడ్ . పదవి కాలం ఇంకా రెండేళ్లు  ఉండగానే ఆయన  రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ధన్కడ్ రాజీనామా వెనక రాజకీయ కారణాలున్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ జైరాం రమేష్ ధన్కడ్ రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి ధన్కడ్ రాజీనామా షాకింగ్ గా, దిగ్బ్రాంతికరంగా ఉందని అన్నారు. ఆయన రాజీనామా వెనక ఏదో పెద్ద కారణం ఉన్నట్లుందని అన్నారు జైరాం రమేష్.

Also Read:-ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం

ధన్కడ్ అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని సమానంగా చూశారని అన్నారు జైరాం రమేష్. మంగళవారం ( జులై 22 ) న్యాయవ్యవస్థకు సంబందించిన కీలక నిర్ణయాలు ప్రకటించాల్సిన క్రమంలో ధన్కడ్ రాజీనామా విషయంలో పునరాలోచించుకోవాలని అన్నారు. ఇది దేశ ప్రయోజనాలతో కూడుకున్న అంశం కాబట్టి ప్రధాని మోడీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అన్నారు జైరాం రమేష్.

ఆరోగ్యమా.. రాజకీయ కారణాలా ? :

74 ఏళ్ల ధన్కడ్ ఇటీవల ఢిల్లీలోని ఎయిమ్స్‌లో యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఆయన రాజీనామా చేయడం సంచలనంగా మారింది. జైరామ్ రమేష్‌సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన రాజీనామ పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభ ఛైర్మన్‌గా, ధంఖర్ ప్రతిపక్షాలతో అనేకసార్లు ధీటుగా ఎదుర్కొన్నారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఆయనపై అభిశంసన తీర్మానాన్ని కూడా ప్రతిపాదించారు. ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.

జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని ప్రాజ్యసభలో ప్రతిపక్షాలు నోటీసు సమర్పించిన ఒకరోజు తర్వాత ధన్కడ్ రాజీనామా ప్రకటించడం ఆసక్తిగా మారింది. జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చిన నోటీసు రాజ్యసభలో సమర్పించిన ఒక రోజు తర్వాత ఆయన నిష్క్రమించడం.. ఇందుకు ధన్కడ్ ఆమోదించడం ప్రబుత్వాన్ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.

పదవీకాలం పూర్తికాకముందే రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతిగా ధన్కడ్ వీ.వీ గిరి, ఆర్ వెంకటరామన్ సరసన చేరారు. అయితే.. వీ.వీ గిరి, వెంకటరామన్ లు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేస్తే.. అందుకు విరుద్ధంగా ధన్కడ్ పదవి నుంచి వైదొలిగారు.తన రాజీనామా లేఖలో రాష్ట్రపతి ముర్ము, ప్రధాన మంత్రి మోడీ, మంత్రి మండలి, ఎంపీల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు ధన్కడ్.