
వీకెండ్లో వచ్చే ఓటీటీ సినిమాలు ఆడియన్స్ను అలరించడంలో ఎప్పుడు ముందుంటాయి. ప్రస్తుతం ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు రియల్ ఇన్సిడెంట్ సినిమాలంటే నెట్ఫ్లిక్స్ అని చెప్పుకునే వాళ్లు. ఆ తర్వాత ప్రైమ్ వీడియో, జీ5 అనుకునే వాళ్ళు. కానీ, ఇప్పుడు కథ మారిపోయింది. దాదాపు అన్నీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మంచి సినిమాలనే తీసుకొస్తున్నాయి. ఈ మధ్యకాలంలో అయితే, జియోహాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీ ప్లాట్ఫామ్ మంచి ఊపు మీద కనిపిస్తోంది. వివిధ భాషల్లో సూపర్ హిట్ అందుకున్న సినిమాల హక్కులను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుంచుతోంది. లేటెస్ట్గా ఓ రెండు సినిమాలు తీసుకొచ్చి ఆడియన్స్కు మంచి ట్రీట్ అందించింది. మరి ఆ సినిమాలేంటీ? వాటి కథేంటీ? అనేది తెలుసుకుందాం.
మై బేబీ (My Baby):
లేటెస్ట్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ DNA.తెలుగులో మై బేబీ (My Baby). ఈ మూవీ ఆడియన్స్కు మంచి థ్రిల్ ఇవ్వడంతో పాటు ఓటీటీలో మంచి వ్యూస్తో దూసుకెళ్తోంది. జూలై 18న థియేటర్లోకి వచ్చి ఆ మరునాడే (జులై 19న) ఓటీటీకి వచ్చి సెన్సేషన్ అయింది ఈ మూవీ. థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు సైతం ఓటీటీలో చూస్తేన్నారు. ఈ క్రమంలో ఇపుడు ఓటీటీలోసైతం అలరిస్తుంది.
ఈ సినిమాలో అధర్వ మురళి, నిమిషా సజయన్ హీరో హీరోయిన్లుగా నటించారు. చేతన్, బాలాజీ శక్తివేల్, రమేష్ తిలక్, మహ్మద్ జీషన్ అయ్యుబ్, రిత్విక, బోస్ వెంకట్ కీలక పాత్రలు పోషించారు.
ఇప్పుడీ ఈ మూవీ జియోహాట్‌స్టార్‌లో ట్రెండ్ అవుతుంది. తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ అదరగొడుతుంది. నెల్సన్ వెంకటేశన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో పాటు రాసుకున్న ట్విస్టులు సైతం మెప్పిస్తున్నాయి. కథకు కావాల్సిన అన్ని అంశాలు ఉండటంతో ఆడియన్స్ ఎంగేజ్ అవుతున్నారు.
తమిళ భాషలో జూన్ 20న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మోస్తారు కలెక్షన్స్ రాబట్టింది. సుమారు రూ.6కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.7కోట్లకి పైగా వసూళ్లు చేసింది. ఈ చిత్రం 2014లో ఒక సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కింది.
Divya & Anand ❤️#DNA Now Streaming on JioHotstar ✨#DNA #DNANowStreaming #DNAonJioHotstar #JioHotstarTamil#DNAMovie @Atharvaamurali #NimishaSajayan #NelsonVenkatesan @Olympiamovis @Ambethkumarmla @maanasa_chou @Filmmaker2015 @editorsabu @GhibranVaibodha@RedGiantMovies_… pic.twitter.com/WDf5Znjr72
— JioHotstar Tamil (@JioHotstartam) July 21, 2025
కథేంటంటే:
ఆనంద్ (అథర్వ)ది సమాజంలో ఒక మంచి పేరున్న ఫ్యామిలీ. కానీ.. ఆనంద్ మాత్రం ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో మందు, గంజాయికి అలవాటు పడతాడు. దాంతో వాళ్ల నాన్న శివ సుబ్రమణ్యం (చేతన్) కొడుకు ప్రవర్తన చూసి విసిగిపోయి, చివరికి ఒక రీహాబిలిటేషన్ సెంటర్‌లో చేరుస్తాడు. దాంతో తిరిగి మామూలు మనిషి అవుతాడు.
ALSO READ | KINGDOM Trailer: ‘కింగ్‍డమ్’ కౌంట్‌డౌన్ షురూ.. ట్రైలర్ రీలిజ్ డేట్ ఇదే!
ఆ తర్వాత అతనికి దివ్య (నిమిషా సజయన్)తో పెళ్లి చేస్తారు. ఆమెకు బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అనే ఒక మానసిక సమస్య ఉంటుంది. శివకి ఈ విషయం తెలిసినా పెండ్లి చేస్తాడు. కొన్నాళ్లకు దివ్య గర్భవతి అవుతుంది. కానీ, బిడ్డను కన్న కొన్ని నిమిషాలకే ఆమె వింతగా ప్రవర్తిస్తుంటుంది. హాస్పిటల్‌లో తన బిడ్డని మార్చారని తన దగ్గర ఉన్నది వేరొకరి బిడ్డ అని వాదిస్తుంటుంది. అందరూ ఆమె మాటలను కొట్టిపారేస్తారు. కానీ.. ఆనంద్ మాత్రం అసలు విషయం తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.
అయితే, ఈ సినిమాలో.. ఆనంద్ భార్యకు అండగా నిలవడంతోనే అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయి. దివ్య చెప్పినట్లు నిజంగానే ఆసుపత్రిలో పుట్టిన బిడ్డను మార్చారా? గతంలో ఇలాంటి సంఘటనలు మరెవరికైనా జరిగాయా? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? చివరకు ఆనంద్ తన నిజమైన బిడ్డను కనుగొన్నాడా? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమాలో ఉత్కంఠభరితమైన కథనంతో సాగుతూ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. పుట్టిన వెంటనే పాపను మాయం చేయడం ఎక్కడికి దారితీసిందనేది ఒక పకడ్బందీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తో తీసి డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
‘స్పెషల్ ఓపీఎస్2’:
ఈ సిరీస్లో హిమ్మత్ సింగ్ అనే పాత్రలో కేకే మీనన్ లీడ్ రోల్‌లో నటించాడు. కరణ్ థాకర్, వినయ్ పాఠక్, విపుల్ గుప్త కీలకపాత్రలు పోషించారు. నీరజ్ పాండే, శివమ్ నాయర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో వచ్చిన ఫస్ట్ సీజన్‌తోపాటు ‘స్పెషల్ ఓపీఎస్ 1.5: ది హిమ్మత్ స్టోరీ’లో వచ్చిన నాలుగు ఎపిసోడ్స్ ఇంప్రెస్ చేశాయి. ఇపుడీ ఈ కొత్త సీజన్ మొత్తం 7 ఎపిసోడ్స్తో స్ట్రీమ్ అవుతోంది. ఈ సిరీస్ ప్రతిక్షణం ఉత్కంఠ రేపే సీన్స్తో ఆడియన్స్ను సీట్లో కూర్చోబెట్టేలా చేస్తోంది.
When the system failed him, justice became personal. Subramanyam is not stopping until the truth is exposed. . #HotstarSpecials #SpecialOps2, now streaming only on #JioHotstar@neerajpofficial @kaykaymenon02 @prakashraaj @pathakvinay @karantacker #TahirRajBhasin @SaiyamiKher… pic.twitter.com/8lqryilRSZ
— JioHotstar (@JioHotstar) July 21, 2025
కథేంటంటే:
టెక్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ పీయూష్ భార్గవ్ (ఆరిఫ్ జకారియా) ఇండియన్ గవర్నమెంట్ టెక్ సిస్టమ్స్ డిజైన్ చేస్తాడు. ఆ తర్వాత బుడాపెస్ట్‌లో జరిగే ఏఐ సమ్మిట్‌లో పాల్గొనడానికి వెళ్తాడు. కానీ.. కొందరు అతన్ని కిడ్నాప్ చేస్తారు. దాంతో ఇండియన్ గవర్నమెంట్, ‘రా’ ఉన్నతాధికారులు పీయూష్‌ను తిరిగి తీసుకొచ్చే బాధ్యతను హిమ్మత్ సింగ్ (కేకే మేనన్)కు అప్పగిస్తారు.
హిమ్మత్ తన టీమ్.. ఫరూక్ అలీ (కరన్ థాకర్), జుని కశ్యప్ (సయామీ ఖేర్), అవినాష్ (ఇబ్రహీం)తో కలిసి ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడే కిడ్నాప్ చేసింది సుధీర్ (తాహిర్ రాజ్ భసిన్) అని, అతను ఇండియన్ డిజిటల్ ఎకానమీని ధ్వంసం చేయడానికి కుట్ర చేస్తున్నాడని తెలుసుకుంటాడు. ఆ తర్వాత పీయూష్‌ని కాపాడేందుకు హిమ్మత్ ఏం చేశాడు? అతనికి ఎదురైన పరిణామాలు ఏంటి? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.
జియోహాట్‌స్టార్‌లో జూన్ నెలలో బ్లాక్‌బస్టర్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' వచ్చి మెప్పించింది. ఇది అన్నీ వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుంది. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం వల్ల మన దేశానికి అక్రమంగా వలస వచ్చిన ఓ చిన్న కుటుంబం చుట్టూ తిరిగే కథ ఇది. అరెస్టు బెదిరింపుల మధ్య, చుట్టుపక్కల వాళ్లతో కలిసిపోడానికి ఎలా కష్టపడాల్సి వచ్చిందనేది ఎమోషనల్ అండ్ కామెడీ కలగలిపి అభిషాన్ తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది.
అంతేకాకుండా మే నెలలో మోహన్ లాల్ నటించిన ‘తుడరుమ్’ మూవీ సైతం జియోహాట్‌స్టార్‌లోనే ఉంది.