‘నిజాం ఆస్తులపై ఎంక్వైరీ చేయాలి‘

‘నిజాం ఆస్తులపై ఎంక్వైరీ చేయాలి‘

హైదరాబాద్‌,వెలుగు: హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు చెందిన రూ.306 కోట్ల ఆస్తులపై వివాదం నెలకొంది. యూకే నాట్వెస్ట్‌ బ్యాంక్‌లో నిల్వ ఉన్న 35 మిలియన్‌ డాలర్ల(రూ.306 కోట్లు)ను ఫేక్‌ డాక్యుమెంట్స్‌తో కొట్టేశారని ఆయన మనవడు నవాబ్ నజాఫ్ అలీ ఖాన్ ఆరోపిస్తున్నారు. యూకే హైకోర్టు కేసు విచారణలో ఉన్న మల్టీ క్రోర్‌  ఫండ్‌ను దుర్వినియోగం చేశారని నలుగురు నిజాం బంధువులపై హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌‌కి మంగళవారం ఫిర్యాదు చేశారు. నిజాం బంధువులైన నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ అలియాస్ ప్రిన్స్ ముకారామ్ జా, అతని మాజీ భార్య ఎస్రా బెర్జిన్ జా, కుమారులు అజ్మత్ జా, ప్రిన్స్ ముఫాఖం జాలు అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యూకే హైకోర్టులో నిజాం నిధుల కేసు విచారణలో ఉండగానే ఫ్యాబ్రికేటెడ్‌ డాక్యుమెంట్స్‌తో నిధులు దారి మళ్ళించారని ఆరోపించారు. ఫేక్ డాక్యుమెంట్స్‌తో రూ.306 కోట్లు దుర్వినియోగం చేసిన వారిపై ఎఫ్ఐఆర్‌‌ రిజిస్టర్ చేయాలని నజాఫ్‌ అలీ ఖాన్‌ సీపీని కోరారు. కేసును లీగల్‌గా పరిశీలించిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని నజాఫ్‌ అలీ ఖాన్‌తో సీపీ చెప్పినట్లు తెలిసింది