బోడో అగ్రిమెంట్ చరిత్రాత్మకం

బోడో అగ్రిమెంట్ చరిత్రాత్మకం

ఈశాన్య రాష్ట్రాల్లో కీలకమైన నిషేధిత బోడో నేతలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం  కుదుర్చుకుంది. అన్ని ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్  ఆఫ్ బోడో ల్యాండ్ తో కేంద్రం సంతకాలు చేసింది. హోంశాఖ మంత్రి అమిత్ షా, అసోం ముఖ్యమంత్రి సోనోవాల్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. అగ్రిమెంట్ లో భాగంగా ఈనెల 30న 1550 మంది బోడో కార్యకర్తలు ప్రభుత్వం ముందు లొంగిపోనున్నారు. 130 అయుధాలను సరెండర్ చేయనున్నారు. అసోంలోని కోక్రజా, చిరాంగ్, ఉదల్ గిరి జిల్లాలు బోడో ప్రాంతంలో ఉన్నాయి.

బోడో అగ్రిమెంట్ చరిత్రాత్మకమన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఈ ఒప్పందం అమలుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని చెప్పారు. ఇకపై బోడో ప్రాంతం, అసోం వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. బోడో ప్రాంత అభివృద్ధి కోసమే కేంద్ర హోంశాఖతో అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పారు NDFB ప్రతినిధులు.