70 లక్షల 97 వేల టన్నుల ధాన్యం కొనుగోలు.. రాష్ట్ర చరిత్రలోనే ఇది మైలురాయి

70 లక్షల 97 వేల టన్నుల ధాన్యం కొనుగోలు.. రాష్ట్ర చరిత్రలోనే ఇది మైలురాయి

హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్​లో 70.97 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి.. రాష్ట్ర చరిత్రలోనే చారిత్రక మైలురాయిగా నిలిచిందని రాష్ట్ర సివిల్​సప్లయ్స్ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ విజయంలో రాష్ట్ర రైతాంగం ప్రధాన భాగస్వామ్యం ఉందని, ప్రభుత్వ శాఖల సమన్వయం, అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి పర్యవేక్షణ ప్రక్రియతో విజయవంతమైందని మంత్రి వివరించారు. 

14 లక్షల మంది రైతులకు మద్దతు ధరతో రూ.16,704 కోట్లు చెల్లించామని తెలిపారు. సన్నాలకు ప్రకటించిన రూ.500 బోనస్‌‌గా రూ.1,425.22 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అనుసరిస్తున్న అనుకూల విధానాలతోనే ఇది సాధ్యమైందని మంత్రి తెలిపారు.