
బిష్ణు అధికారి, అదితి శర్మ, ఆంచల్ శర్మ హీరో హీరోయిన్లుగా బిష్ణు దర్శకత్వంలో దీపక్ అధికారి నిర్మిస్తోన్న స్పై థ్రిల్లర్ ‘హిట్ మ్యాన్’. నవంబర్‌లో సినిమా రిలీజ్ కానుంది. రీసెంట్‌గా ఈమూవీ టీజర్‌ను నిర్మాత ఎ.ఎం.రత్నం విడుదల చేసి టీమ్‌కి ఆల్ ద బెస్ట్ చెప్పారు. హీరో, డైరెక్టర్ బిష్ణు అధికారి మాట్లాడుతూ ‘ఇదొక న్యూ ఏజ్ మూవీ. బూర్జ్ ఖలీఫాలో షూటింగ్ చేశాం.
మనదేశంతో పాటు పారిస్, దుబాయ్, నేపాల్, శ్రీలంక దేశాల్లో షూట్ చేశాం. దీన్ని మూడు భాగాలుగా చిత్రీకరిస్తున్నాం. ఛాప్టర్ 1 నవంబర్‌లో రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. హిందీలోనూ రిలీజ్ చేయటానికి చర్చలు జరుపుతున్నాం. నేను మార్వల్ సినిమాలకు పెద్ద అభిమానిని. అదే స్టైల్లో దీన్ని రూపొందిస్తున్నా. డైరెక్టర్ సముద్ర, మంత్ర ఆనంద్, కో ప్రొడ్యూసర్ సిప్రా మిశ్రా తదితరులు పాల్గొన్నారు.