
బెంగళూరు: టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు. ఫిట్‌నెస్ ఇష్యూస్‌తో తరచూ ఇబ్బంది పడుతున్న హిట్‌మ్యాన్ తొడ కండరాల గాయం కారణంగా సౌతాఫ్రికా టూర్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అక్కడి ఎక్స్‌పర్ట్స్.. బరువు తగ్గించుకోవాలని హిట్‌మ్యాన్‌కు సూచించారు. కొంచెం స్లిమ్‌గా మారితే.. కాలి కండరాలు, మోకాళ్లపై ప్రెజర్ తగ్గుతుందని, దానివల్ల గాయాలకు దూరంగా ఉండొచ్చని చెప్పారు. దాంతో, రోహిత్ ఇప్పుడు వెయిట్ లాస్ అయి, ఇంకా ఫిట్‌గా మారే పనిలో పడ్డాడు. ఇందుకోసం ఎన్‌సీఏ ట్రెయినర్స్ గైడెన్స్‌లో వర్కౌట్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జిమ్‌లో వెయిట్స్ ఎత్తుతూ కనిపించాడు. మరోవైపు శిఖర్ ధవన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, సంజు శాంసన్ కూడా ఎన్‌సీఏలో ట్రెయిన్ అవుతున్నారు. ఫిట్‌నెస్ ఇష్యూస్ వల్ల సఫారీ టూర్‌కు జడ్డూ దూరంగా ఉండగా... ధవన్, భువీ వన్డే సిరీస్‌కు సెలెక్ట్ అయ్యారు. తొందర్లోనే మిగతా టీమ్‌తో కలిసి వీళ్లు సౌతాఫ్రికా వెళ్తారు.