
హైదరాబాద్, వెలుగు: ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహం ఏర్పాటుకు భూమిని కేటాయిస్తూ హెచ్ఎండీఏ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని తెల్లాపూర్‌లో సర్వే నంబర్323/14లోని 1076.4 చదరపు గజాల స్థలాన్ని కేటాయించినట్టు అధికారులు మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. కొంత కాలంగా గద్దర్ విగ్రహం ఏర్పాటుకు భూమి కేటాయించాలంటూ పలువురు డిమాండ్‌చేశారు. దీంతోపాటు గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలంటూ తెల్లాపూర్ మున్సిపాలిటీ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని హెచ్‌ఎండీఏ ఆమోదించింది.