హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తోంది. ఇప్పటీకే సిటీలోని అనేక చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చి ప్రభుత్వ భూములను కాపాడింది. తాజాగా గురువారం (జనవరి 22) మేడ్చల్ పరిధిలోని శామీర్ పేటలో రోడ్డు ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను తొలగించింది.
మేడ్చల్ పరధిలోని శామీర్ పేట్ ఫ్రెండ్ కాలనీలో గత 30 ఏళ్లుగా 20 ఫీట్ల రోడ్డు ఆక్రమించుకున్నారు కబ్జాకోరులు. ఈ క్రమంలో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు..ఆక్రమణలు నిజమేని తేల్చి కూల్చివేతలు చేపట్టారు. రోడ్డు ను ఆక్రమించి నిర్మించిన ప్రహారీ గోడను జెసీబీలతో కూల్చివేశారు. అక్రమనిర్మాణాలను తొలగించి రోడ్డు కు డైరెక్షన్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఫ్రెండ్స్ కాలనీ వాసులు.
