- ప్రకటించిన హెచ్పీసీఎల్-మిట్టల్ ఎనర్జీ
న్యూఢిల్లీ: ఆంక్షల కారణంగా రష్యా ముడి చమురు కొనుగోలును నిలిపివేస్తున్నట్లు ఉక్కు వ్యాపారవేత్త లక్ష్మీ మిట్టల్, హెచ్పీ కలిసి ఏర్పాటు చేసిన జేవీ హెచ్‌ఎంఈఎల్ బుధవారం ప్రకటించింది. రష్యా ముడి చమురుపై అమెరికా, యూరప్, యూకే, కొత్త ఆంక్షలు విధించిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది.
మిట్టల్ గ్రూప్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) కలిసి ఏర్పాటు చేసిన హెచ్‌ఎంఈఎల్, రష్యా చమురు ఉత్పత్తిదారులపై ఆంక్షలు విధించాక రష్యా ముడి చమురును కొనబోమని అధికారికంగా ప్రకటించిన మొదటి భారతీయ సంస్థ. ఇది పంజాబ్‌లోని భటిండాలో చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్వహిస్తోంది.
