జూలై 20 నుంచి ‘ఖని’లో నిరవధిక నిరహార దీక్ష...సింగరేణిలో మెడికల్ బోర్డు సాధన కోసం: హెచ్ఎంఎస్

జూలై 20 నుంచి ‘ఖని’లో నిరవధిక నిరహార దీక్ష...సింగరేణిలో మెడికల్ బోర్డు  సాధన కోసం: హెచ్ఎంఎస్

గోదావరిఖని, వెలుగు: సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం, మెడికల్ బోర్డు సాధన కోసం జూలై 20 నుంచి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో హెచ్ఎంఎస్, తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో కార్మిక కార్మికుల కుటుంబసభ్యులతో కలిసి వంటావార్పు, -నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఆదివారం గోదావరిఖనిలోని హెచ్ఎంఎస్​ఆఫీస్​లో జరిగిన సమావేశంలో యూనియన్​జనరల్​ సెక్రటరీ రియాజ్​అహ్మద్, డిప్యూటీ జనరల్​సెక్రటరీ గోశిక అశోక్, ఎల్.వెంకటేశ్ ​మాట్లాడుతూ.. మెడికల్​బోర్డు కొనసాగించాలని, మారుపేర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్​చేశారు. 

టెన్త్ పాస్​ కాలేదనే సాకుతో ఆపేసిన వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, సొంతింటి పథకం కింద హౌసింగ్​బోర్డు సొసైటీని ఏర్పాటు చేయాలని కోరారు. కార్మికుల పక్షాన నిలబడాల్సిన ఏఐటీయూసీ, ఐఎన్‌‌టీయూసీ లీడర్లు యాజమాన్యానికి, అధికార పార్టీకి బ్రోకర్లుగా మారారని, ప్రధాన సమస్యలను పక్కనపెట్టి 40 డిమాండ్లతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కార్మికుల సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. మీటింగ్​లో లీడర్లు కిరణ్, క్రాంతి కుమార్, సతీశ్, శ్రీకాంత్, ఎస్కే వలీ, చందర్ తదితరులు పాల్గొన్నారు.