
న్యూఢిల్లీ: రాయ్ బరేలీలోని హాకీ స్టేడియానికి.. ఇండియా స్టార్ ప్లేయర్ రాణి రాంపాల్ పేరు పెట్టారు. గతంలో ఉన్న ఎంసీఎఫ్ రాయ్ బరేలీ హాకీ స్టేడియం పేరును ‘రాణీస్ గర్ల్స్ హాకీ టర్ఫ్‌గా’ మార్చారు. దీంతో హాకీలో తన పేరుపై స్టేడియాన్ని కలిగిన తొలి క్రీడాకారిణిగా రాణి రికార్డు సృష్టించింది.
మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాణి రిబ్బన్ కట్ చేసి ఈ స్టేడియాన్ని ప్రారంభించింది. ‘హాకీకి నేను చేసిన కృషిని గౌరవించినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరును పెట్టినందుకు సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి మాటలు రావడం లేదు. ఇదో భావోద్వేగ క్షణం’ అని రాణి పేర్కొంది.