
హైదరాబాద్, వెలుగు:పెండింగ్ కేసుల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న మెగా లోక్ అదాలత్‌కి భారీ స్పందన వస్తోంది. శనివారం జరిగిన మెగా లోక్ అదాలత్‌లో 3,02,768 కేసులను పరిష్కరించారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 19,761 ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించి, బాధితులకు, లబ్ధిదారులకు రూ.116.33 కోట్ల నష్ట పరిహారం అందించారు. ఇరుపక్షాల అంగీకారంతో కేసులను క్లోజ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించినట్లు లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ ఎస్.గోవర్ధన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.