క్రీ.శ. 320లో గుప్త యుగం ఉనికిలోకి వచ్చింది. గుప్తులు శక్తివంతులు, ఐతిహ్యం కలవారు. ఆ యుగం, ఆ వంశం అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాడుకలో ఉంది. ఈనాటికీ చంద్రగుప్తుడు – కుమారీదేవీ చిత్రాలు ముద్రించిన నాణాలు ఉన్నాయి. మౌర్య వంశంలో మొదటివాడు చంద్రగుప్తుడు. ఆయన తర్వాత వారసుడిగా సముద్ర గుప్తుడిని ఎంపిక చేసి, ‘దిగ్విజయ’మే అతని ప్రథమ లక్ష్యమని, నాలుగు దిక్కులను జయించడం, సంప్రదాయానుసారంగా క్షత్రీయులందరికీ వర్తించేది అని ప్రతిజ్ఞ చేయించాడు.
సముద్ర గుప్తుడు గంగా మైదాన మధ్య ప్రాంత అధిపతిగా పొరుగు గంగా ప్రాంత రాజులను బలవంతంగా పెరికేసి, ఆ సంస్థానాలను తన రాజ్యంలో కలుపుకున్నాడు. సొంత రాజ్యంలో సురక్షిత స్థితి ఉండడంతో తను దండయాత్రకు బయలుదేరాడు. అలాగే కొనసాగిస్తూ మద్రాసు కోస్తా తీరానికి చేరుకున్నాడు. ఆ దండయాత్రతో భారతదేశ గొప్ప చక్రవర్తిగా నిరూపించుకున్నాడు. దీంతో పొరుగుదేశాల రాజులతోపాటు రోమన్ సామ్రాజ్యం, చైనాతోను సత్సంబంధాలను ఏర్పరచుకోగలిగాడు. వాటిలో ముఖ్యమైనవి ఇంకా కొనసాగుతున్న కుషాన్ రాజ్యాలు (కాబూల్‌కు చెందినది), సిలోన్ (శ్రీలంక). శ్రీలంక రాజు బుద్ధగయ దగ్గర బౌద్ధ యాత్రికుల కోసం ఒక పెద్ద మఠం కట్టించడానికి అనుమతినిచ్చాడు.
సముద్రగుప్తుడు దండయాత్ర తర్వాత రాజసూయ యాగం చేశాడు. ఒక గుర్రాన్ని స్వేచ్ఛగా సంచరించడానికి వదిలిపెట్టి అది ఏ రాజ్యంలోకి ప్రవేశిస్తే అక్కడికెళ్లి, ఆ రాజును సవాల్ చేస్తాడు. ఒకవేళ గెలిస్తే తానే ఆ దేశ సార్వభౌమునిగా ప్రకటించుకుని తన రాజధానికి తిరిగి వెళ్తాడు. ఆ గుర్రాన్ని దేవుళ్లకు బలిచ్చాడు. సముద్రగుప్తుడు కవి, సంగీతకారుడు. ఆయన పరిపాలనా కాలంనాటి నాణాల మీద ఆయన వీణలాంటి ఒక వాయిద్యాన్ని వాయిస్తున్నట్టుగా ఉంటుంది. ఆయన పరిపాలన మలిదశలో అన్ని సంస్థానాలలో శాంతి నెలకొంది. పద్యం, కవిత్వం, సంగీతం, నాటక కళలు బాగా వృద్ధి చెందాయి.
సుమారు క్రీ.శ.380లో సముద్ర గుప్తుడు మృతిచెందాడు. ఆయన కొడుకు రెండో సముద్రగుప్తుని పరిపాలనలో ఆ యుగం పూర్తి ఉచ్ఛ స్థితికి చేరింది. అతడు తూర్పు బెంగాల్, ఇప్పుడున్న కథియావార్, గుజరాత్, ఉజ్జయిని చుట్టుపక్కల ప్రాంతాలను జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఆఖరి దండయాత్ర మిగతావాటన్నింటినీ అధిగమించింది. అది ఆయనకు పశ్చిమ సముద్ర ప్రాంతంలో కాలుమోపడానికి, బ్రోహ్, కాంబే నౌకాశ్రయాల ద్వారా ఈజిప్ట్, పశ్చిమ దేశాలతో సాంగత్యానికి అవకాశం కల్పించింది.
400వ సంవత్సరం కల్లా గుప్త సామ్రాజ్యం ఇప్పటి ఆధునిక వాయువ్య పంజాబ్ సరిహద్దు నుంచి తూర్పున గంగా డెల్టా వరకు, హిమాలయ దక్షిణ ప్రాంతం నుంచి నర్మదా నదీ తీర రేఖ వరకు, సింధ్, రాజుపుటానాలో అధికభాగం మినహా వ్యాపించింది. సముద్ర గుప్తుడు రాజధానిని పాటలీ నుంచి ఆధునిక లక్నో, అయోధ్యలకు మార్చాడు. తర్వాతి తరంలో వచ్చిన కుమారగుప్తుడు దాదాపు నలభై ఏండ్లు పరిపాలించాడు. ఆయన పాలనాకాలం మొదటి సంవత్సరాలలో హిందూ సాంస్కృతిక విప్లవం ఇంకా ఊపందుకుంది. 440 కల్లా ఉత్తర భారతం, స్థిరమైన, ఉజ్వలమైన విజయవంతమైన వందేళ్ల ప్రభుత్వాన్ని చూసింది.
కానీ, గుప్త సామ్రాజ్యం, ముస్లిం సామ్రాజ్యం లాగానే గొప్ప అధికారాన్ని అనుభవిస్తూనే కూలిపోయే స్థితికి వచ్చింది. కుమారగుప్తుడు హూణుల చేతిలో హతుడయ్యాడు. అతని కొడుకు స్కంధ గుప్తుడు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. అయితే, 465లో హూణులు మళ్లీ వచ్చారు. 480లో స్కంధగుప్తుడి మరణానంతరం ఆ సామ్రాజ్య వాయవ్య ప్రాంతాలన్నింటినీ జయించారు. ఆరో శతాబ్దం ఆరంభమయ్యేనాటికి వాళ్ల పరిపాలన కేవలం ‘మగధ’ కే పరిమితమైంది. ఇది గుప్త సార్వభౌముల ప్రస్థానం.
- మేకల మదన్మోహన్ రావు,కవి, రచయిత-
