హోల్డర్ ఆల్‌‌రౌండ్ షో..విండీస్ థ్రిల్లింగ్ విక్టరీ

హోల్డర్ ఆల్‌‌రౌండ్ షో..విండీస్ థ్రిల్లింగ్ విక్టరీ

లాడర్‌‌‌‌హిల్ (యూఎస్‌‌ఏ): జేసన్ హోల్డర్ (4/19; 16 నాటౌట్‌‌) సూపర్‌‌‌‌ బౌలింగ్‌‌కు తోడు చివరి బాల్‌‌కు ఫోర్ కొట్టడంతో పాకిస్తాన్‌‌తో రెండో టీ20లో వెస్టిండీస్ ఉత్కంఠ విజయం సాధించింది. ఆదివారం  జరిగిన ఈ పోరులో 2 వికెట్ల తేడాతో ఆఖరి బాల్‌‌కు గెలిచి మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 1–1తో సమం చేసింది. తొలుత పాక్‌‌ నిర్ణీత 20 ఓవర్లలో 133/9 స్కోరు చేసింది.

  హసన్ నవాజ్ (40), కెప్టెన్ సల్మాన్ అఘా (38), ఫఖర్ జమాన్ (20) రాణించారు. విండీస్ బౌలర్లలో హోల్డర్ నాలుగు, గుడకేశ్ మోతీ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌‌లో విండీస్ 20 ఓవర్లకు 135/8 స్కోరు చేసి నెగ్గింది. ఓపెనర్లు అలిక్ అతానజె (2), జెవెల్ ఆండ్రూ (12) ఫెయిలవగా.. కెప్టెన్ షై హోప్ (21), రోస్టన్ ఛేజ్ (16), మోతీ (28) జట్టును రేసులో నిలిపారు. చివర్లో రొమారియో షెఫర్డ్ (15)తో కలిసి హోల్డర్ విండీస్‌‌కు విజయం అందించాడు. పాక్ బౌలర్లలో నవాజ్ రెండు, సైమ్ ఆయుబ్ రెండు వికెట్లు పడగొట్టారు. హోల్డర్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య చివరి, మూడో టీ20 సోమవారం జరుగుతుంది.