మూడో వేవ్ ముప్పు.. జాతరలు, సంబురాలు వద్దు 

మూడో వేవ్ ముప్పు.. జాతరలు, సంబురాలు వద్దు 

న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హెచ్చరించింది. కరోనా ప్రభావం తగ్గిపోయిందని భావించొద్దని.. జాగ్రత్తగా ఉండకపోతే కరోనాతో ముప్పు తప్పదని ఐఎంఏ చీఫ్ జె.ఎ.జయాలాల్ సూచించారు. ‘మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న ఈ సమయంలో ఉత్సవాలు, జాతరలు, సంబురాలు జరపడం చాలా ప్రమాదకరం. ఎక్కువ మంది ప్రజలు గుమిగూడే వేడుకల విషయంలో తమ నిర్ణయాన్ని పున: సమీక్షించుకోవాలని కేంద్రాన్ని కోరాం’ అని జయాలాల్ తెలిపారు. ఒడిశాలో పూరి జగన్నాథ రథయాత్ర, ఉత్తరాఖండ్‌లో మహా శివుడి కావడి యాత్ర జరుగుతున్న నేపథ్యంలో జయాలాల్ పైవ్యాఖ్యలు చేశారు. కాగా, పూరి జగన్నాథుడి రథయాత్రలో భక్తులకు అనుమతి ఇవ్వలేదు. ఈ రథయాత్రలో కేవలం 500 మందికే అనుమతిచ్చారు.