ఓజోన్ పొరకు భారీ రంధ్రం.. కారణమదేనంటున్న సైంటిస్టులు

ఓజోన్ పొరకు భారీ రంధ్రం.. కారణమదేనంటున్న సైంటిస్టులు
  • ఓజోన్ పొరకు రంధ్రం.. ఇండియా కన్నా 8 రెట్లు పెద్దది
  • 2.48 కోట్ల చదరపు కిలోమీటర్ల మేర ఉందన్న నాసా

న్యూఢిల్లీ: సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావయొలెట్​ (యూవీ) వంటి డేంజర్​ కిరణాల నుంచి కాపాడే కవచంలా ఉన్న ‘ఓజోన్’ లేయర్ కరాబైపోతోంది. ఆ కవచానికి పడిన రంధ్రం నానాటికీ పెద్దదవుతోంది. పోయినేడాది లాగానే ఇప్పుడు కూడా ఓజోన్ పొరకు రంధ్రం పడిందని, అయితే, 2021లో ఓజోన్​కు పడిన రంధ్రం ఇండియా కన్నా 8 రెట్లు పెద్దగా ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్​(ఎన్వోఏఏ) సైంటిస్టులు హెచ్చరించారు. రంధ్రం సైజు 2.48 కోట్ల చదరపు కిలోమీటర్లుందని చెప్పారు. సదరన్​ హెమీస్ఫియర్​లో ఏర్పడిన అతి చల్లని వాతావరణ పరిస్థితులే ఓజోన్​ రంధ్రం పెద్దగవ్వడానికి కారణమైందని చెప్పారు. నవంబర్, డిసెంబర్ వరకు ఆ రంధ్రం అలాగే ఉండొచ్చన్నారు. 1979 నుంచి ఇప్పటిదాకా ఓజోన్​కు పడిన రంధ్రాల్లో ఇది13వ అతిపెద్ద రంధ్రమని నాసా ఎర్త్​సైన్సెస్​ చీఫ్ సైంటిస్ట్ పాల్ న్యూమన్ చెప్పారు. వాతావరణంలోని క్లోరిన్, బ్రోమిన్ వంటి కెమికల్స్ స్థాయిలు పెరిగిపోవడం వల్లే ఓజోన్ లేయర్ మందం తగ్గి రంధ్రం పెరగడానికి కారణమైందని పేర్కొన్నారు.