హోలీ మత్తెక్కిందా బేబీస్.. రన్నింగ్ బైక్‪పై రొమాంటిక్ సీన్స్.. రూ.33వేలు ఫైన్

హోలీ మత్తెక్కిందా బేబీస్.. రన్నింగ్ బైక్‪పై రొమాంటిక్ సీన్స్.. రూ.33వేలు ఫైన్

దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోలీ ఆనందంగా జరుపుకున్నారు. యువత, పిల్లలు రంగులు చల్లుకుంటూ.. మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ హోలీ పండగ వేళ కూడా కొందరికి రీల్స్ పిచ్చి పోలే.. భిన్నంగా హోలీ సెలబ్రేట్ చేసుకొని సోషల్ మీడియాలో త్వరగా పాపులర్ అవుదామని..  పిచ్చి చేష్ఠలతో రోడ్లెక్కారు కొంతమంది యువత. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో ముగ్గురు వ్యక్తులు జరుపుకున్న హోలీ వీడియో ఇంటర్నేట్ ను షేక్ చేస్తోంది. ఓ యువకుడు నడుపుతున్న స్కూటీపై ఇద్దరు అమ్మాయిలు ఎదురెదురుగా కూర్చొని రొమాంటిక్ సాంగ్ కు ఫోజులు ఇస్తూ రీల్ చేశారు. ఈ వీడీయోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్షణాల్లోనే వైరల్ గా మారిపోయింది.

రన్నింగ్‪లో ఉన్న స్కూటీ మీద కూర్చొని ఇద్దరు అమ్మాయిలు మోహే రంగ్ లగాడే బాలీవుడ్ పాటకి డ్యాన్స్ చేస్తున్నారు. రొమాంటిక్ ఎక్స్‪ప్రెషన్స్‪తో అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియో షూట్ చేశారు. ఈ వీడియోలో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వారు అమ్మాయిల ప్రవర్తన అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల పోలీసులు సీరియస్ యాంక్షన్ తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తూ కామెంట్స్ చేశారు. ఈ వీడియోలు వైరల్ అయిన కాసేపటే పోలీసులు స్పందించి.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై రూ.33వేలు ఫైన్ విధించినట్లు నోయిడా ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ వేదికగా తెలిపారు. మోటర్ వెహికల్ యాక్ట్ కింద రూ.33 వేల ఈఛలాన్ జారీ చేశారు. రీల్స్ పేరుతో రాష్  డ్రైవింగ్, నిబంధనలు పాటించకపోతే, పబ్లిక్ న్యూసెన్స్ చేసినా.. కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తున్నారు.