ఈ నెల 22న వారికి మాత్రమే సెలవు

ఈ నెల 22న వారికి మాత్రమే సెలవు

ఈ నెల 22న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరగనుండటంతో ఈ సెలవు ఇస్తున్నట్లు తెలిపింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా హక్కు ఉన్న వారికి ప్రత్యేక సాధారణ సెలవు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ ఆదేశాలు జారీచేశారు.

తెలంగాణలోని మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌- కరీంనగర్‌ జిల్లాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలతో పాటు వరంగల్‌- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఈ నెల 22న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.