
హైదరాబాద్, వెలుగు: ఛత్రపతి శివాజీ మహరాజ్ సాధారణ వ్యక్తి నుంచి మరాఠా సామ్రాజ్యానికి రాజుగా ఎదిగారని ఛత్రపతి శివాజీ మహరాజ్ఫౌండేషన్ చైర్మన్ సీడీ చవాన్ కొనియాడారు. ఆలయాల రక్షణకు, గెరిల్లా యుద్దంలో పోరాట పటిమ, గోవులపై ఆయన భక్తిని గుర్తుచేశారు. ఆదివారం సికింద్రాబాద్ లోని మినర్వా కాంప్లెక్స్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
కార్యక్రమానికి వందల మంది కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం శివాజీ మహారాజ్‌కు వందన కార్యక్రమం నిర్వహించారు. ఆయన జయంతిని సెలవుదినంగా ప్రకటించేందుకు 5 వేల మంది మద్దతును కూడగట్టగా వారికి సీడీ చవాన్ కృతజ్ఞతలు తెలిపారు. ఛత్రపతి శివాజీ జయంతిని సెలవుదినంగా సమర్థించేవారు 07941055779కి కాల్ చేసి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో అతిథులుగా యోగేశ్ ప్రభు జీ, అనిల్ కాఠేకర్, పర్మేశ్వరి, వెంకట్ దానధర్మ, చంద్రశేఖర్, వెంకటాచలం, శ్రీకాంత్, రాజేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.