జక్కన్నకు కామెరూన్ బంపరాఫర్

జక్కన్నకు కామెరూన్ బంపరాఫర్

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి  హాలీవుడ్‌ దర్శక దిగ్గజం జేమ్స్‌ కామెరూన్‌ బంపరాఫర్‌ ఇచ్చారు. భవిష్యత్తులో  రాజమౌళి  హాలీవుడ్‌ లో మూవీ చేయాలనుకుంటే తనను సంప్రదించాలని సూచించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను RRR  టీమ్‌  పంచుకుంది. 

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌ వేడుకలో  జేమ్స్ కామెరూన్, రాజమౌళి కలిశారు. ఈ సందర్భంగా RRR  మూవీని రెండుసార్లు చూసినట్లు రాజమౌళికి చెప్పిన జేమ్స్ కామెరూన్  సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా తనకు బాగా నచ్చిందంటూ..అందులోని సన్నివేశాలపై కాసేపు చర్చించారు. జేమ్స్ కామెరూన్‌ ప్రశంసతో రాజమౌళి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఈ మొత్తం సంభాషణకు... జేమ్స్ కామెరూన్ ఆఫర్ కు సంబంధించిన  ఓ స్పెషల్‌ వీడియోను RRR టీమ్ రిలీజ్ చేసింది.