
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘వృషభ’. రోషన్, శనయ కపూర్, జహ్రా ఖాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నంద కిషోర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రా కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీని హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు.
తాజాగా ఈ ప్రాజెక్టులోకి హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో భాగస్వామి అయ్యారు. మూన్ లైట్ (2016), థ్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ (2017) లాంటి చిత్రాలకు ఆయన వర్క్ చేశారు. ఇండియన్ సినిమాలో భాగమవడం ఆనందంగా ఉందని తుర్లో అన్నారు. తుర్లో రాకతో తమ సినిమా స్థాయి పెరిగిందని, హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఇండియన్ సినిమా ఇదని నిర్మాతలు చెప్పారు.