కరోనా పేషంట్లకి హోమ్ మేడ్​ఫుడ్ డెలివరీ..

కరోనా పేషంట్లకి హోమ్ మేడ్​ఫుడ్ డెలివరీ..
  • హోమ్ మేడ్​ఫుడ్​కి మస్తు డిమాండ్
  • ఓల్డేజీ వారికి, ఐసోలేషన్​ పేషెంట్లకు డోర్ డెలివరీ
  • బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్.. మూడు పూటలా ఫుడ్​ 
  • అవసరాన్ని బట్టి అందుబాటులో ప్యాకేజీలు
  • కుకింగ్​ తో ఉపాధి పొందుతున్న మహిళలు

మాదాపూర్​లో ఉంటున్న ఒక కుటుంబంలోని వారందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. అందరూ హోమ్ ఐసోలేషన్​లో ఉంటున్నారు. బయటకు  వెళ్లలేని పరిస్థితి. హోటల్, రెస్టారెంట్ల నుంచి తెప్పించుకుంటే హైజీనిక్​గా ఉంటుందో లేదో.. టేస్ట్​ ఎలా ఉంటుందో అన్న డౌట్​..  దీంతో ఆన్​లైన్​లో సెర్చ్ చేసి..  హోమ్ మేడ్ ఫుడ్ అందిస్తున్న వారి గురించి తెలుసుకున్నారు. ట్రాన్స్ పోర్టేషన్ చార్జీలు కూడా భరిస్తామని చెప్పి మరీ ప్యాకేజీ మాట్లాడుకున్నారు.  వారం రోజుల నుంచి టేస్టీ, హెల్దీ  హోమ్ మేడ్ ఫుడ్ తినగలుగుతున్నామని  అంటున్నారు.’’

హైదరాబాద్, వెలుగు: ఓల్డేజ్ వారికి, కొవిడ్ పాజిటివ్ పేషెంట్లకు హోమ్ మేడ్ ఫుడ్  కాన్సెప్ట్ బాగా ఉపయోగపడుతున్నది. ఇండ్లల్లో ఉండే చాలామంది మహిళలు తమ కుకింగ్​ స్కిల్స్​తో ఈ  హోమ్ మేడ్ ఫుడ్ బిజినెస్ మొదలుపెడుతున్నరు. యాప్ ల ద్వారా చాలామంది వీళ్ల సర్వీసెస్ ని వాడుకుంటున్నారు. మొదటి లాక్ డౌన్ టైమ్​లో కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు హోమ్ ఐసోలేషన్​ పేషెంట్లకు హెల్దీ మీల్స్​ ప్యాకేజీలు అందించాయి. ఇప్పుడు హోమ్ చెఫ్స్ ఈ కాన్సెప్ట్ ని  సిటీ అంతటికి విస్తరించారు. ప్యాకేజీని బట్టి నెలకి రూ.400ల నుంచి 7500ల వరకు చార్జి చేస్తున్నారు.

శుచీ శుభ్రతకు ప్రియారిటీ 
ప్రస్తుతం ఇమ్యూనిటీ పెంచే ఫుడ్​కే ప్రయారిటీ ఇస్తున్నారు.  పెద్దవాళ్లు, కొవిడ్ బారిన పడి హోమ్ ఐసోలేట్ అయిన వారు తమ పనులు చేసుకోవడంతో పాటు వంట కూడా వండుకోవాలంటే కష్టమే. అందుకే బయట నుంచి తెప్పించుకుంటున్నారు. గతంలో హోటళ్ల నుంచి మాత్రమే ఫుడ్​ సప్లై జరిగేది. కొత్తగా హోమ్​చెఫ్​లు క్వారంటైన్ మీల్ అందిస్తున్నారు. ఇంట్లోనే వండుతూ ఇద్దరు, ముగ్గురు డెలివరీ బాయ్స్ ద్వారా చుట్టుపక్కల ఏరియాలకు ఫుడ్ సప్లై చేస్తున్నారు. వండేప్పుడు తప్పకుండా మాస్క్, గ్లౌజులు వాడుతున్నారు.  టిఫిన్, లంచ్, డిన్నర్.. మూడు పూటలా హెల్దీ, హైజీనిక్ ఫుడ్ ని అందిస్తున్నారు.  ఆకుకూరలు, కూరగాయలు, పప్పు, సాంబార్ లతో పాటు  కస్టమర్లు కోరితే  సలాడ్, మీట్ లాంటివి కూడా ఇస్తున్నారు. డెలివరీ బాయ్స్​తో పంపితే  ట్రాన్స్ పోర్టేషన్ చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. దూరంగా ఉండే కస్టమర్లు స్విగ్గీ, జొమాటోల ద్వారా ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంది. 

ఫుల్ రెస్పాన్స్...
ఈ క్వారంటైన్ మీల్​కి ఫుల్ రెస్పాన్స్ వస్తుంది. హోమ్ చెఫ్స్ కు  రోజుకి 50కి పైగా ఆర్డర్లు వస్తున్నాయి. ఓల్డేజ్​, క్వారంటైన్​ వాళ్లతో పాటు  బ్యాచిలర్స్ కూడా ఈ సేవలను  వినియోగించుకుంటున్నారు. ఎవరి అవసరాలు, వీలు బట్టి వారం రోజులు, ఐదు రోజుల ప్యాకేజీలు ఆర్డర్​ చేస్తున్నారు.  పండుగలప్పుడు కస్టమర్లు కోరితే స్వీట్, స్పెషల్ ఐటమ్స్​ అందిస్తున్నామని హోమ్ మేడ్ ఫుడ్ సప్లయర్లు చెబుతున్నారు.

మా అమ్మ కోసం..
నేను, నా వైఫ్ ఇద్ద రం ఎంప్లాయిసే.  నా భార్య యూఎస్ బేస్డ్ కంపెనీలో పనిచేస్తుంది. సాయంత్రం నుంచి తెల్లవారే వరకు ఆఫీస్ వర్క్ ఉంటుంది. ఇంట్లో కుక్ చేసేంత టైం ఉండదు. మా అమ్మకి ఫుడ్ కష్టంగా మారింది. మా కొలీగ్స్  హోమ్ మేడ్ ఫుడ్ గురించి చెప్పారు.  మా అమ్మ కోసం మేం కూడా ప్యాకేజీ తీసుకున్నాం.  ఆరు నెలల నుంచి ఫుడ్ డోర్ డెలివరీ చేస్తు న్నారు. నెలకి ట్రాన్స్​పోర్ట్​ చార్జిలతో కలిపి రూ.  11,500 ఖర్చు వస్తుంది. ఫుడ్​ టేస్టీగా ఉంటోంది. నీట్​గా ప్యాక్​ చేసి ఇస్తున్నారు. 
-  సుబ్రమణ్యం, కస్టమర్

ఇంట్లోనే వండి...
మేం ఉండేది బర్కత్ పుర. మా పేరెంట్స్  తార్నాకలో  ఉంటారు. గతేడాది లాక్ డౌన్ టైంలో మా అమ్మా నాన్న ఫుడ్ కోసం స్ట్రగుల్ అయ్యారు. దాంతో నేనే వండి పంపా. తర్వాత  విదేశాల్లో ఉన్న కొందరు రిలేటివ్స్​ ఇక్కడ ఉండే వారి పేరెంట్స్​ కోసం వండిపెట్టమన్నారు. దాంతో నేను,  నా ఫ్రెండ్ రేవతి ఈ బిజినెస్​ స్టార్ట్​ చేశాం. లాక్ డౌన్​లో జాబ్ పోయిన ఇద్దరు మహిళలు, ఇద్దరు ఆటో వాళ్లను పెట్టుకున్నాం. వారితో ఫుడ్ ప్రిపేర్ చేయించి డోర్ డెలివరీ చేస్తున్నం.   ప్రస్తుతం రోజుకి 50 మందికి కుక్ చేస్తున్నాం. హోమ్ ఐసోలేట్ అయిన పేషెంట్లకు, ఓల్డేజ్ వారికి  ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాం. దూరం ఉంటే కస్టమర్లే ఓలా, ఉబెర్ ద్వారా ఆర్డర్ బుక్ చేసుకుంటున్నారు. 
 - మాధవి చెపూర్, క్విక్ మీల్ 7, ఫౌండర్