బి.ఫార్మాసి చేసినోళ్లకు మంచి ఛాన్స్.. NIEPIDలో మెడికల్ ఉద్యోగాలు.. కొద్దిరోజులే అవకాశం..

బి.ఫార్మాసి చేసినోళ్లకు మంచి ఛాన్స్.. NIEPIDలో మెడికల్ ఉద్యోగాలు.. కొద్దిరోజులే అవకాశం..

హైదరాబాద్​లోని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్​మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీస్ (NIEPID) ఫార్మాసిస్ట్, అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్, ఇతర  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 07. 

పోస్టుల సంఖ్య: 17.

పోస్టులు: ఆయుర్వేదిక్ ఫిజీషియన్ 01, హోమియోపతిక్ ఫిజీషియన్ 01, యునాని ఫిజీషియన్ 01, యోగా & నేచురోపతి థెరపిస్ట్ 01, సిద్ధ సాధకుడు 01, ఫార్మాసిస్ట్ (ఆయూష్) 01, పంచకర్మ టెక్నీషియన్ 01, టెక్నీషియన్స్ అండ్ థెరపిస్ట్స్ 05, అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ 05. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.ఫార్మా, డిప్లొమా, బీఏఎంఎస్, బీయూఎంఎస్, ఎం.ఫిల్/ పీహెచ్​డీ, ఎంఎస్/ ఎండీ, ఎంఎస్​డబ్ల్యూ, బీఎస్ఎంఎస్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

లాస్ట్ డేట్: నవంబర్ 07. 

సెలెక్షన్ ప్రాసెస్: అప్లై చేసుకున్న అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ షార్ట్​లిస్ట్ చేస్తుంది.  ఆ తర్వాత రాత పరీక్ష/ ఇంటర్వ్యూ  నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.   

పూర్తి వివరాలకు niepid.nic.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.