అమెరికాలో ఇంటిని శుభ్రం చేయలేదని భర్తపై భారత సంతతికి చెందిన మహిళ కత్తితో దాడి చేసింది. నార్త్ కరోలినాలో కుటుంబంతో కలిసి ఉంటున్న ఈమె ఇల్లు శుభ్రం చేయడం గురించి జరిగిన గొడవలో తన భర్తపై కత్తితో దాడి చేసింది. ఈ కేసులో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆమె నార్త్ కరోలినాలోని ప్రాథమిక పాఠశాలలో టీచర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది.WBTV వెలువరించిన అరెస్ట్ వారెంట్ ప్రకారం.. అక్టోబర్ 12న ఆదివారం రోజు ఇల్లు క్లీన్ చేసే విషయంలో చంద్రప్రభ సింగ్ అనే మహిళకు, ఆమె భర్తకు మధ్య వాదన జరిగింది. ఈ గొడవలో కోపం అణుచుకోలేకపోయిన చంద్రప్రభ భర్తపై కత్తితో దాడి చేసింది.
మెడపై కత్తితో దాడి చేయడంతో ఈ ఘటనలో ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. చాలా రక్తం పోవడంతో హాస్పిటల్కు తరలించి వైద్యం అందించారు. చంద్రప్రభ భర్త అరవింద్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నార్త్ కరోలినాలోని షార్లెట్‌లోని బాలంటైన్ ప్రాంతంలోని ఫాక్స్‌హావెన్ డ్రైవ్‌లోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఎండ్‌హావెన్ ఎలిమెంటరీ స్కూల్‌లో K-3 తరగతులకు టీచర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చంద్ర ప్రభ సింగ్పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
