
ప్రతీ ఒక్కరికీ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ఉండాలన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ ఏర్పాటు చేసిన రన్ ఫర్ రోడ్ సేఫ్టీ కార్యక్రమానికి హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, ట్రాఫిక్ పోలీస్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. ట్రాఫిక్, లా అండ్ అర్డర్ విషయంలో పోలీసులు అద్భుతంగా పని చేస్తున్నారని చెప్పారు హోంమంత్రి. హైద్రాబాద్ నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతుందన్నారు. తెలంగాణలో సేఫ్టీ అండ్ సెక్యురిటి ఉందని ఇతర రాష్ట్రాల వల్లే అంటున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నగర అభివృద్ధికి, పోలీస్ శాఖకు అధిక నిధులు కేటాయించారన్నారు. ప్రతి రైడర్ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన పెరగడంతో.. సిటీలో యాక్సిడెంట్స్ తగ్గాయన్నారు సీపీ.
అర్ధరాత్రి వరకు పబ్బుల హంగామా.. నాలుగు పబ్ లపై కేసు