పోలీసుల త్యాగాలు మరువలేనివి

పోలీసుల త్యాగాలు మరువలేనివి

పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలు మరువలేనివని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం గోషామహల్‎లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజన్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడారు. కరోనా కారణంగా గతేడాది కాలంలో 62 మంది పోలీసులు, 10 మంది హోమ్ గార్డులు చనిపోయారన్నారు. వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటుందన్నారు. మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తున్నామని ఆయన అన్నారు. మహిళల కోసం భరోసా సెంటర్లు, షీ టీమ్‎లు నిరంతరం పనిచేస్తున్నాయని హోంమంత్రి అన్నారు. 

సమాజాన్ని నేర రహితంగా మార్చడానికి పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. 1959 నుంచి ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీస్ అమరవీరులను గుర్తు చేసుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 377 మంది పోలీసులు మరణించారని తెలిపారు. పోలీస్ వ్యవస్థ మీద తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన అన్నారు. పోలీస్ కుటుంబ సభ్యులకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామన్నారు. గోషామహల్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొని నివాళులర్పించారు.

For More News..

షారూఖ్ ఇంటికి ఎన్సీబీ అధికారులు

గర్ల్​ ఫ్రెండ్​ లేదంటే భార్య ఉండాల్సిందే..!