
రెస్టారెంట్, హోటల్ లేదా కేఫ్‌కి వెళ్లాలంటే చేతిలో డబ్బుంటే సరిపోతుంది. కానీ, జైపూర్‌లోని ఈ రెస్టారెంట్‌కి వెళ్లాలంటే మాత్రం డబ్బుతో పాటు పక్కన గర్ల్ ఫ్రెండ్ లేదంటే భార్య ఉండాల్సిందే. ఒకవేళ ఎవరూ లేదంటే మొహమాటం లేకుండా గేటు బయట నుంచే గెట్ అవుట్ అనేస్తాడు సెక్యూరిటీ గార్డ్. ఈ రెస్టారెంట్ రూల్స్ అలాంటివి మరి. టైంతో పాటు ట్రెండ్స్ కూడా మారుతున్నాయి. ప్రజెంట్ ట్రెండ్స్‌కి తగ్గట్టే కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయడానికి డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నాయి రెస్టారెంట్లు, హోటల్స్. అలా ఈ మధ్య జైపూర్‌లోని ఓ రెస్టారెంట్ కూడా కొంచెం వెరైటీగా ఆలోచించింది. ‘మా రెస్టారెంట్లో మగవాళ్లు తినాలంటే ఆడవాళ్లని వెంటబెట్టుకుని రావాల్సిందే’ అనే రూల్ పెట్టింది. ఇదే విషయాన్ని రెస్టారెంట్ గోడలతో పాటు ఏసీపైనా రాసి మరీ చెబుతోంది. దాన్ని ఫొటో తీసి హర్షిత శర్మ అనే మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘నా ఫ్రెండ్ నన్ను ఎందుకు ఈ రెస్టారెంట్‌కి తీసుకెళ్లాడో అర్థమయ్యింద’ని ఆ ఫొటో కింద ఫన్నీ క్యాప్షన్ పెట్టింది. అంతే... కొద్ది నిమిషాల్లోనే ఈ ట్వీట్ తెగ వైరల్ అయింది. వేలల్లో లైక్స్ కూడా వచ్చాయి. చాలామంది దీన్ని రీ ట్వీట్ చేస్తున్నారు. పోటీలు పడి మరీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఒకరైతే ఏకంగా ఈ రెస్టారెంట్ వెతికి పట్టుకుని దీని పేరు ‘గోపీ భోజనాలయం’ అని ట్విట్టర్లో దండోరా వేశారు. ఇంకొందరు తమ ఏరియాలో ఉన్న ఇలాంటి స్పెషల్ రెస్టారెంట్ల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ రెస్టారెంట్‌కి మాత్రం ఫ్రీగా ఫుల్ పబ్లిసిటీ దొరికింది. కానీ, లేడీస్ ఉంటేనే ఎంట్రీ ఏంటన్న విషయం మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు. రెస్టారెంట్ వాళ్లు కూడా ఏం చెప్పలేదు.