సోషల్ మీడియా 'అల్గోరిథం' మాయలో పడుతున్నారా? యువతలో పెరుగుతున్న ఈటింగ్ డిజార్డర్స్!

  సోషల్ మీడియా 'అల్గోరిథం' మాయలో పడుతున్నారా? యువతలో పెరుగుతున్న ఈటింగ్ డిజార్డర్స్!

సోషల్ మీడియా కేవలం ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవ్వడానికే కాదు, కొన్నిసార్లు  మన మానసిక ఆరోగ్యంపై, ముఖ్యంగా మనం తినే ఆహారం అలాగే  మన శరీరం పట్ల మనకున్న ఆలోచనలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని కొత్త పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

మనం సోషల్ మీడియాలో ఏది చూస్తామో, దానికి సంబంధించిన మరిన్ని పోస్టులను మనకు చూపించేలా అల్గోరిథంలు పనిచేస్తాయి.  ఎలా అంటే ఎవరైనా బరువు తగ్గడం గురించి లేదా ఫిట్‌నెస్ గురించి ఒక్కసారి వెతికితే, వారి ఫీడ్ మొత్తం డైట్ ప్లాన్‌లు, సన్నగా అయ్యేందుకు చిట్కాల  ఫోటోలతో నిండిపోతుంది. ఈటింగ్ డిజార్డర్స్ నుండి కోలుకుంటున్న వారు ఇలాంటి కంటెంట్‌ను చూడకూడదని అనుకున్నా, అల్గోరిథంలు పదే పదే వాటినే చూపిస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నాయి.

 పరిశోధనల ప్రకారం, 17 నుండి 19 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ఐదుగురు అమ్మాయిలలో ఒకరు ఏదో ఒక రకమైన 'తినే రుగ్మత'తో బాధపడుతున్నారు. సోషల్ మీడియాలో కనిపించే అందమైన శరీర ఆకృతి యువతలో అసంతృప్తిని పెంచుతున్నాయి.

సోషల్ మీడియాకి కేవలం వయస్సు పరిమితులు పెట్టడమే కాకుండా, హానికరమైన కంటెంట్‌ను ప్రోత్సహించకుండా  అల్గోరిథంలను మార్చుకోవాలి. సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదీ నిజం కాదని, ఫోటోలు ఎడిట్ చేసి ఉంటాయని యువతకు స్కూల్స్  స్థాయి నుండే అవగాహన కల్పించాలి. మనం సోషల్ మీడియాలో ఎంత సమయం గడుపుతున్నాం అనే దానికంటే, అక్కడ ఎలాంటి విషయాలను చూస్తున్నాం అనేది ముఖ్యం అని  నిపుణులు  సూచిస్తున్నారు 

సోషల్ మీడియా  ఈ సమస్యలకు కారణం కాకపోయినా, అల్గోరిథంలు చూపే కంటెంట్ వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. మన డిజిటల్ ప్రపంచం ఆరోగ్యకరంగా ఉండాలంటే సాంకేతిక నియంత్రణ, వ్యక్తిగత అవగాహన రెండూ అవసరం.