షారూఖ్ ఇంటికి ఎన్సీబీ అధికారులు

షారూఖ్ ఇంటికి ఎన్సీబీ అధికారులు

బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ఇంటికి ఎన్సీబీ అధికారులు చేరుకున్నారు. బాంద్రా సమీపంలోని షారూక్ నివాసమైన ‘మన్నత్’కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యొక్క బృందాలు చేరుకున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్టయి.. ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న తన కొడుకు ఆర్యన్ ఖాన్‎ను కలిసి వచ్చిన కాసేపటికే ఎన్సీబీ అధికారులు రావడం గమనార్హం. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కు సంబంధించి కొన్ని పేపర్ల వర్క్ కోసమే ఇక్కడకు వచ్చామని ఎన్సీబీ అధికారులు చెబుతున్నారు.

డ్రగ్స్ కేసులో అక్టోబర్ 3న అరెస్టయిన ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‎ను ముంబై ప్రత్యేక కోర్టు బుధవారం తిరస్కరించింది. దాంతో ఆర్యన్ ఖాన్‎ను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు.

For More News..

రాష్ట్రంలో ‘వైరల్’ అటాక్.. ఆస్పత్రుల్లో పేషంట్ల క్యూ..

ఇంటర్ పరీక్షలకు సహకరించం.. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు

కూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం